Search
Sunday 27 May 2018
  • :
  • :

రహదారులు రక్తసిక్తం

మృతుల్లో విద్యార్థులే అధికం,అలంకారప్రాయంగా సెంట్రల్ లైటింగ్
రాత్రి సమయాలలో ఎక్కువ ప్రమాదాలు,ఎక్కడా ప్రమాద హెచ్చరికలు లేని వైనం

                  Bike-Accident

మన తెలంగాణ/నార్సింగి: వేగంగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు వీలుగా విశాలంగా నిర్మించిన రేడియల్ రోడ్ల మలుపులు యమపురికి తలుపులుగా మారాయి. ప్రతి సంవత్సరం దుర్మరణం చెందుతున్నారు. లంగర్‌హౌజ్ నుండి అప్పా వరకు. లంగర్‌హౌజ్ నుంచి నార్సింగి వరకు వేసిన రేడియల్ రోడ్లపై ఉన్న మలుపులు ప్రమాదాలకు నెలవుగా మారాయి. వాహనదారుల వేగానికి కళ్లెం వేసేందుకు ఏక్కడా ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడం, స్పీడ్ లిమిట్‌ను సూచించే బోర్డులు అమర్చకపోవడం, చౌరస్తాల్లో ట్రాఫిక్ సిగ్నళ్లు ఏర్పాటు చేయకపోవడం తదితర కారణాలతో రేడియల్ రోడ్లపై తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

ప్రమాదాలు జరిగే ప్రాంతాలు: టిప్పుఖాన్ బ్రిడ్జ్ మలుపులు, హైదర్శాకోట్‌లోని రఘురాంనగర్‌కాలనీ మలుపు, మైసమ్మగుడి మలుపు, బండ్లగూడ బస్టాప్, కల్లుకంపౌండ్, అరె మైసమ్మ గడి మలుపు, అప్ప జంక్షన్, రామ్‌దేవ్‌గూడ, తారమతిబారాదరి బస్‌స్టాపు మలుపు, నార్సింగి నుండి మంచిరేవుల చౌరస్తా, గండిపేట నుండి ఖానాపూర్ వెళ్లే మలుపుల వద్ద తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

మృతుల్లో విద్యార్థులే అధికం: సిబిఐటి, ఎంజిఐటి, జేబిఐటి, పడాలరామిరెడ్డి, వాసవి కళశాల, శ్రీదేవి, ఎస్‌ఎస్‌జే కళశాల విద్యార్థులు నిత్యం రేడియల్ రోడ్లపై రాకపోకలు సాగిస్తుంటారు. వీరిలో సుమారు ఐదు నుండి ఆరువేల ద్విచక్ర వాహనాలు, కార్లల్లో వెళుతుంటారు. చాలా వరకు రోడ్డు ప్రమాదాలలో విద్యార్థులు మృతి చెందుతున్నారు. ఇందుకు మితిమిరిన వేగమే కారణం అని తెలుస్తోంది. లంగర్‌హౌజ్ నుండి కాళీమందిర్ నుండి చాలామంది చిలుకూరుకి రాకపోకలు సాగిస్తుంటారు. లంగర్‌హౌజ్ నుండి వెళ్లే సన్‌సిటీ, కేకే గార్డెన్ సమీపంలో ఉన్న మలుపుల వద్ద రెండు ఫీట్ల మేర పేరుకుపోయిన ఇసుకే ప్రమాదాలకు కారణం అవుతుంది.

ఇసుక వల్ల ద్విచక్ర వాహనాలు స్కిట్ అయ్యి డివైడర్‌లను ఢీకొని మృత్యువాత పడుతున్నారు. రేడియల్ రోడ్డు ప్రమాదాలలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. బండ్లగూడ మీదుగా గల రేడియల్ రోడ్లపై 70శాతం ప్రమాదాలు జరుగగా, నార్సింగి మీదిగా ఉన్నా రేడియల్ రోడ్లపై 30శాతం రోడ్డు ప్రమాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోడ్లు మెత్తం మూడు పోలీసు స్టేషన్ పరిధిలోకి రావడం వీటి నిర్వహణ కష్టంగా మారింది. వాహనాలు మితిమీరినా వేగంతో రాకపోకలు సాగిస్తుండడంతో ప్రమాదకరంగా మారింది. ఒక వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తున్న సమయంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. టిప్పుఖాన్ బ్రిడ్జ్, నార్సింగి వెళ్లే ప్రధాన రహదారి, అలగే కాళీమందిర్ వెళ్లే రేడియల్ రహదారులలో సెంట్రల్ లైటింగ్ సరిగ్గా పనిచేయక పోవడంతో రాత్రి సమయాల్లో వేగంగా వచ్చే వాహనాలను పసిగట్టడంలో విఫలమౌతుండడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి.

Comments

comments