Search
Sunday 20 May 2018
  • :
  • :
Latest News

సైనికుల త్యాగాలు మరువలేం

soldier

*సాయుధ దళాల పతాక దినోత్సవ సందర్భంగా విరాళాల సేకరణ  *విరాళం అందజేసిన కలెక్టర్ మాణిక్కరాజ్ కణ్ణన్ 

మన తెలంగాణ/సంగారెడ్డి క్రైం : దేశరక్షణ కోసం తమ జీవితాలను త్యాగం చేస్తూ తమ భార్య, పిల్లలను ఇంటి దగ్గరే వుంచి ఎక్కడో దేశ సరిహద్దులలో భారతదేశ రక్షణ కొరకు, భారత ప్రజల సుఖశాంతుల కొరకు పనిచేస్తున్న భార త త్రివిధ దళాల సేవలు మరవలేనివని అందుకే వారి సంక్షేమానికి ప్రతి ఒక్క భారత దేశ పౌరుడు చేయూతనందిస్తూ వారికి సంఘీభావం తెలుపుట అత్యవసరమని జిల్లా కలెక్టర్ మాణిక్కరాజ్ కణ్ణ న్ పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో గురువారం సాయుధ దళాల పతాక దినోత్సవంను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తన వంతు విరాళాన్ని అందజేసి సైనికులకు, మాజీ సైనికులకు, మాజీ సైని క వితంతువులకు కృతజ్ఞతలను తెలియజేసినారు. దేశ భద్రతలో భాగంగా శత్రువుల దాడులలో అమరులై తమ ప్రాణాలను సైతం ఖాతరు చేయకుండా భారతదేశ ప్రజలకు రక్షణ కవచంలా ఉం టున్నారని కొనియాడారు. అలాగే జిల్లా ప్రజలు తమ వంతు విరాళాలను సైనిక సంక్షేమానికి అందించాలని ఈ విరాళాలను సైనిక కుటుంబాలకు అందజేయ డం జరిగిందన్నారు. దేశరక్షణ కొరకు చేసిన త్యాగాల కన్నా మించిన త్యాగం మరి ఏదీ లేదని కొనియాడారు. ఈ కా ర్యక్రమంలో రీజినల్ సైనిక సంక్షేమ శా ఖ అధికారి ఎం.నరేందర్‌రెడ్డి, సిబ్బంది శివకుమార్, సులేమాన్  పాల్గొన్నారు.

Comments

comments