Search
Sunday 17 December 2017
  • :
  • :
Latest News

నా కళ్లలో నీళ్లొచ్చేశాయి

sumanth

స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సుమంత్, ఆకాంక్ష సింగ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘మళ్లీ రావా’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాహుల్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు సుమంత్‌తో జరిపిన  విశేషాలు… 

ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో…
క్యూట్ రొమాంటిక్ డ్రామా ‘మళ్లీ రావా’. ఇందులో కార్తిక్‌గా నటించాను. నాకు, హీరోయిన్ అంజలి మధ్య జరిగే రొమాంటిక్ డ్రామా ఈ చిత్రం. సినిమా కథ సింపుల్‌గా ఉన్నప్పటికీ దర్శకుడు ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
‘గోదావరి’ చిత్రానికి దగ్గరగా…
గతంలో నేను చేసిన చిత్రాలకంటే ఈ సినిమా పూర్తిగా కొత్తగా ఉంటుంది. అయితే ‘గోదావరి’ చిత్రానికి దగ్గరగా ఉంటుంది ఈ సినిమా. నా కెరీర్‌లో ఓ డిఫరెంట్ మూవీగా ఈ చిత్రం నిలుస్తుంది.
కొత్త అనుభూతి…
కార్పొరేట్ ఉద్యోగి పాత్రలో నేను కనిపిస్తాను. విభిన్నంగా ఉండే ఈ పాత్ర ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. సినిమాలో హీరోయిన్ ఆకాంక్ష సింగ్ చక్కగా నటించింది.
35 రోజుల్లో పూర్తి…
ఈ సినిమాతో నా ప్రయాణం సంవత్సరం క్రితం మొదలైంది. చిత్ర దర్శకుడు గౌతమ్ నన్ను కలిసినప్పుడు అతను ఈ సినిమాను చేయగలుగుతాడా? అనిపించింది. కానీ అతను కథ చెప్పిన తర్వాత నా కళ్లలో నీళ్లొచ్చేశాయి. ఆతర్వాత వెంటనే ఈ సినిమాకు ఓకే చెప్పాను. అయితే 10 నెలల పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిగింది. అనంతరం 35 రోజుల్లో సినిమా షూటింగ్ సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేశాం.
చాలా కష్టపడ్డాడు…
దర్శకుడు గౌతమ్ ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా కోసం అతను చేసిన గ్రౌండ్‌వర్క్ ఎంతగానో ఆకట్టుకుంది. అతని పనితనం, సినిమా అవుట్‌పుట్ నన్ను పూర్తిగా సంతృప్తిపరిచింది.
తదుపరి చిత్రాలు…
కొత్త దర్శకుడు అనిల్ శ్రీకందంతో కలిసి ఓ డార్క్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాను. దీని తర్వాత మరో రెండు సినిమాలకు కూడా సైన్ చేశాను. వీటి వివరాలను త్వరలో వెల్లడిస్తాను.

Comments

comments