Search
Wednesday 23 May 2018
  • :
  • :

ప్రజావాణికి ఆన్‌లైన్ ద్వారా విశేష స్పందన

madam

మన తెలంగాణ/యాదాద్రిభువనగిరి : ప్రజా సమస్యలు పరిష్కరించడంలో బాగంగా ఆన్ లైన్‌ద్వారా అర్జీదారులకు మంచి స్పందన లభిస్తుందని జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ తెలిపారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ప్రజావాణిలో ప్రజల నుండి అర్జీలకు కలెక్టర్ స్వీ కరించారు. అర్జీదారులకు తగిన సహాకారం అందించాలని సంబందిత అధికారులను ఆదేశి ంచారు. ప్రజావాణిలో ఎక్కువగా భూ వివాదాలు భూముల సర్వేకు సంబందించిన సమస్య లపై అధికంగా ఫిర్యాదులు అందుతున్నట్లు ఆమె తెలిపారు. వలిగొండ మండలం దుప్పల్లి గ్రా మానికి చెందిన మత్సవ్యాపారి శ్రామికసంఘం సభ్యులు తమ సొసైటీలో అక్రమాలు జరు గుతున్నాయని తెలుపగా అందుకు స్పందించిన కలెక్టర్ తగు విచారణ జరుపాలని సంబందిత అధికారికి ఆదేశించారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇంటి స్థలాల కెటాయింపు, ఇతర రెవెన్యూ పిర్యాదులపై ప్రజల నుండి ప్రజావాణి ద్వారా 65 దరఖాస్తులు ఆమె స్వీకరించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో డిఆర్‌ఓ మహేందర్‌రెడ్డి, డిఆర్‌డిఎపిడి  పాల్గొన్నారు.

Comments

comments