Search
Sunday 17 December 2017
  • :
  • :
Latest News

ముగిసిన నాల్గోరోజు ఆట.. లంక లక్ష్యం 410

Dhawan,Kohli-and-Rohit

ఢిల్లీ: వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 31 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ఇక రెండో ఇన్నింగ్స్‌ను భారత్ 246/5 వద్ద డిక్లేర్డ్ చేసింది. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 373 పరుగులకు ఆలౌట్ కాగా, టీమిండియా 536 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ 163 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని లంక ముందు 410 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది. భారత బ్యాట్స్‌మెన్లలో శిఖర్ ధావన్(67), కోహ్లీ(50), రోహిత్ శర్మ(50), పుజారా(49) పరుగులు చేశారు. అనంతరం భారీ లక్షంతో బరిలోకి దిగిన శ్రీలంక 14 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. సమవిక్రమా(5)ను షమీ పెవిలియన్‌కు పంపాడు. ఆ తరువాత మరో ఓపెనర్ కరుణరత్నే(13)తో పాటు నైట్‌వాచ్‌మెన్‌గా వచ్చిన లక్మల్(0)లను జడేజా ఒకే ఓవర్‌లో అవుట్ చేశాడు. దీంతో లంక 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో మాథ్యూస్(0), డిసిల్వా(13) ఉన్నారు. లక్ష్యానికి లంక ఇంకా 379 పరుగుల దూరంలో ఉండగా చేతిలో 7 వికెట్లు ఉన్నాయి.

Comments

comments