Search
Monday 11 December 2017
  • :
  • :

చిన్నారిని చిత్రహింసలకు గురి చేసిన సవతి తల్లి

Step-mother

చండీగడ్: క్యాన్సర్‌తో తల్లి చనిపోవడంతో అమ్మ ప్రేమకు నోచుకొని ఆ చిన్నారికి ప్రేమని పంచాల్సిన ఓ సవతి తల్లి చిన్నరిని ఇష్టనుసారంగా కొట్టి హిసంచి చివరికి జైలు పాలైంది. చండీఘడ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చండీగడ్ సెక్టార్ 29లో నివాసముండే ఓ మహిళ తన సవతి కూతురైన చిన్నరిని సంచిలోకుక్కి చితకబాదింది. జుట్టు పట్టి, చెవులు పిండుతూ..చిన్నారిని చిత్రహంసలకు గురిచేసింది. అప్పటికే కాలుగాయంతోని బాధపడుతున్న చిన్నారిపై కోంచెం కూడా కనికరం చూపించలేదు. ఈ తంతంగాన్ని ఆ చిన్నారి సోదరుడు సెల్‌ఫోన్‌లో బందించడంతో ఈ విషయం బయటపడింది. రెండు నెలల క్రితం ఆ చిన్నారి తల్లి క్యాన్సర్  మరణించడంతో  తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న చిన్నారి తండ్రి ఆ కసాయి తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు . కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. ఈ ఘటన పై నెటీజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

Comments

comments