Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

ఆర్‌టిసి బస్సు కిందపడి విద్యార్థిని దుర్మరణం

School Bus Collided to Lorry in Road Accident in AP

రాజన్న సిరిసిల్ల: ఆర్‌టిసి బస్సు కిందపడి విద్యార్థిని మృతి చెందిన విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం నామాపూర్‌లో గురువారం చోటుచేసుకుంది. స్థానిక ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న శ్రావణి తోటి విద్యార్థులతో కలిసి బస్సు ఎక్కే క్రమంలో ప్రమాదం జరిగింది. విద్యార్థులు ఎక్కుతున్న సమయంలో డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును ముందుకు పొనిచ్చాడు. దీంతో శ్రావణి బస్సు కిందపడి అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Student Dead in RTC Bus Accident in Rajanna Siricilla District.

Comments

comments