Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

బంగారు తెలంగాణలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలి

play

మన తెలంగాణ/కామారెడ్డి:  బంగారు తెలంగాణలో విద్యార్థులు భాగస్వాములు కావాలని అందుకు క్రీడలలో పాల్గొంటే ధైర్యంగా స్వయం శక్తిగా ఎదుగుతారని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ప్రభుత్వ వెనుక బడిన తరగతుల వసతి గృహాల విద్యార్థుల జిల్లా స్థాయి ఆటల పోటీలను స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. వాలీబాల్ ఫైనల్ మ్యాచ్‌కు ఎంపికైన నిజాంసాగర్, భాన్సువాడ టీముల మధ్య పోటీలను జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో క్రీడల ఏర్పాటుకు వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు చక్కని స్పూర్తితో క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. చదువుపైనే కాకుండా క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. క్రీడలతో ఆత్మవిశ్వాసం ,నమ్మకం ధైర్యం ఏర్పడతాయన్నారు. విద్యార్థులకు  ఉపాద్యాయులు క్రీడల పట్ల ఆసక్తి కలిగేలా సూచనలివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ అధికారి దేవిదాస్ , కేశవులు, రేవంత్, జిల్లాలోని వసతి గృహాల వార్డెన్‌లు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments