Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

సబ్సిడీ గొర్రెలను విక్రయిస్తే కఠిన చర్యలు

policeమనతెలంగాణ/దుబ్బాక :  సబ్సిడి గొర్రెలను ఎవరైన విక్రయిస్తే చట్టరిత్య చర్యలు తప్పవని సబ్ ఇన్‌స్పెక్టర్ సుభాష్‌గౌడ్ అన్నారు. సోమవారం రోజున దుబ్బాక స్దానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లభ్దిదారుల ప్రమేయంతో దళారులు గొర్రెలను విక్రయిస్తున్న వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరళిస్తున్నట్లు వారు తెలిపారు. దోషులను విలేకరుల ముందు హజరుపరిచారు. ఈ విషయమై ఎస్‌ఐ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సబ్సిడి గొర్రెలను పంపిణి పధకాన్ని కొందరు అధిక దరలకు విక్రయించి డబ్బులు దండుకుంటున్నట్లు తెలిపారు.సబ్సిడిపై మంజూరి చేసిన గొర్రెలను విక్రయదారులతో కల్సి ధళారులు చేతులు కలిపి లారీలలో తరలిస్తున్నారన్నారు. మండలంలోని కమ్మరపల్లి గ్రామానికి చెందిన దారబోయిన మల్లేశం, అచ్చుమాయపల్లికి చెందిన బత్తుల రాజమల్లు అను ఇద్దరు వేరు వేరుగా గొర్రె కాపదారుల వద్దనుండి 3000 రూపాయలకు ఒకటి చొప్పున కొనుగోలు చేసి తమ షెడ్‌లలో ఉంచినట్లు వారు పేర్కోన్నారు. హైదరాబాద్‌లోని మండిలో పరిచయమైన కర్ణాటక రాష్ట్రానికి చెందిన లాల్‌మహ్మద్‌కు చెప్పగా అతడు లారీ నెంబర్ hr 55k8239 ని కిరాయికి తీసుకుని, షేక్ కుతుబుద్దిన్ అనే వ్యక్తిని డ్రైవర్‌ను  నియమించుకుని గత మూడు రోజుల క్రితం ధళారులైన మల్లేశం, రాజమల్లు గ్రామాలకు వెళ్ళి ఒక్కొక్క గొర్రెకు 3700 చొప్పున ధరకు ఒప్పందం చేసుకుని మొత్తం 166 గొర్రెలను తన లారీలో తరళిస్తుండగా వెటర్నరి అసిస్టెంట్ కు సమాచారం రాగా, పట్టుకునే ప్రయత్నం చేయగా వారు పరారి అయ్యారన్నారు.ఆయన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వారిని స్దానిక బస్టాండ్ వద్ద సంచరిస్తుండగా  పట్టుకుని విచారించగా నిజం ఒప్పుకున్నందుకు వారిని జ్యూడిషియల్ రిమాండ్‌కు పంపించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రవీందర్‌రెడ్డి, మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.

Comments

comments