Search
Friday 20 April 2018
  • :
  • :

లబోదిబో ప్రయాసలు!

 

chatbandar

మనుషులలో బై డిఫాల్ట్ ‘ శాడిజం’ ఉందని నా అనుమానం. చూడండి ఓ మనిషి సవ్యంగా మెట్లు దిగాడు అనుకోండి ..మనకు నవ్వురాదు. అదే.. అతను మెట్లు దిగుతూ తొట్రుపాటుతో కింద పడ్డ్డాడనుకోండి.. మనం దానిని ఎంజాయ్ చేస్తాం. వెంటనే పగలబడి నవ్వుతాం. అంటే మనలోని శాడిస్టిక్ ఇన్‌స్టింక్ట్ ఎప్పుడూ ఎదటివారి అవస్థకి సంతోషపడి నవ్వుల పండగ చేసుకోడానికి రెడీగా ఉంటుందన్న మాట.

ఇటువంటి శాడిజం ఒకోసారి రాజకీయ పార్టీలలో కూడా కనపడుతుంది. ఎన్నికల్లో మనం నెగ్గడం కంటె ప్రత్యర్థి పార్టీ ఓడిపోవడం ముఖ్యం కొందరికి. ఎంత డబ్భైనా ఖర్చుపెట్టి ఎదుటి పార్టీని ఓడించడానికి సదరు శాడిస్టు రెడీ. అదే ఖర్చుకి తాము గెలిచేది ఖాయం అయినా సరే.

మనలో ఆ ఇదికి మరో ఉదాహరణ- పక్కింట్లో దొంగలు పడడం. భళ్లున తెల్లవారేసరికి పక్కింట్లో రాత్రి దొంగలు పడి సర్వం దోచుకున్నారన్న వార్త పనిమనిషి ద్వారా చెవిన పడగానే లోపల నుంచి మనకు తెలియని ఆనందం తన్నుకొస్తుంది. అలా ఆనందిస్తూనే , పైకి ‘చ్చొ చ్చొచ్చొ’ అని సానుభూతి ఒలకబోస్తాం. మనింట్లో దొంగలు పడనందుకు కాకుండా కేవలం పక్కింట్లో పడ్డారన్నదే ఆ ఆనందానికి కారణం.
పెళ్ల్లిళ్లు కూడా అంతే. ఇప్పుడు తగ్గిందిగానీ మునుపు ఒక్క గ్లాసైనా ఎగరందే పెళ్లి కాదు అనే ‘ అలిఖిత శాడిస్టిక్ రాజ్యాంగం’ ఉండేది. పెళ్లికొడుకు అలక పాన్పు మీద కూడా పేచీలు పెట్టకుండా చులాగ్గా మంచం దిగేస్తే అది పెళ్లి కానేకాదనే సూత్రం అమలులో ఉండేది. పెళ్లి చివరి దాకా గ్లాసు ఎగురుతుందని ఎదురు సూసిన ఆసామీ అలా జరగకుండా పెళ్లి అయిపోవస్తుంటే ‘ ఠెట్’ అనే పొలికేక లంకించుకొంటాడు. పేచీ మొదలు పెడతాడు. దారి పక్కన పడి ఉన్న రాళ్లను పోగేసి విస్తట్లో ఉంచి ‘ బియ్యంలో ఇంత పెద్ద పెద్ద రాళ్లా వేసేది . కాస్త చిన్నవి దొరకనే లేదా?ఆడ పెళ్లివారికి చూపు ఆనదా ఏమిటి?’ అని తగూ మొదలుపెడతాడు.
అలాంటిదే గోడ తగవు. ఆరారగా ప్రహారీ గోడమీద హక్కు ఎవరిదో గుర్తు చేయకపోతే జోగినాధానికి తోచదు. ఇంటి సరిహద్దు గోడ అవతల నుంచి మామిడి చెట్టు రాల్చిన కాయల విషయమై పక్కింటాయన్ని దుంప తెంపి, ధూపం వేస్తేగాని ఆతడికి మనశ్శాంతి ఉండదు. ఆ కాయలు చల్లగా తీసి జాగ్రత్త చేద్దామనుకొంటే పక్కింటోడు గమనించడం పసిగట్టి ఎదురు పేచీకి దిగుతాడు జోగినాధం. చెట్టు వేళ్లు నా వాటాలోకి దిగకుండా ఆపలేనివాడివి నువ్వేం కాయల యజమానివయ్యా అని అరుస్తాడు. ’అదంతా ‘బై డిఫాల్ట్ శాడిజం’ తప్పే అంటాను.
ఇటువంటి శాడిజం ఒకోసారి రాజకీయ పార్టీలలో కూడా కనపడుతుంది. ఎన్నికల్లో మనం నెగ్గడం కంటె ప్రత్యర్థి పార్టీ ఓడిపోవడం ముఖ్యం కొందరికి. ఎంత డబ్భైనా ఖర్చుపెట్టి ఎదుటి పార్టీని ఓడించడానికి సదరు శాడిస్టు రెడీ. అదే ఖర్చుకి తాము గెలిచేది ఖాయం అయినా సరే.
కొంతమంది మధ్య తరగతి జనం తమ నవ్వు కంటె పక్కింటివారి ఏడుపుని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. పక్కింటి వారి ఏడుపు కోసం ఫ్రిజ్‌లు, కార్లు అవసరం లేక పోయినా కొనేస్తూ ఉంటారు. మాకు తెలిసిన ఒకావిడ పక్కింటి పొగరు అణచడానికి పది లక్షలు బ్యాంకులో అప్పు చేసి అవీ ఇవీ కొంది. చివరకు ఆ పక్కింటివారు బదిలీ అయి వెళ్లి పోయారు. పది లక్షల బాకీ తీరేది ఎప్పటికో తెలియక ఆ ఇంటాయన లబోదిబో! ఇంతలో మరో పక్కింటివారు రెడీ!

Comments

comments