Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ షురూ

Cherry

టాలీవుడ్‌లో  మరో చారిత్రాత్మక చిత్రం బుధవారం షూటింగ్ ప్రారంభించుకుంది.   స్వాతంత్య్ర స మరయోధుడు ఉయ్యాలవాడ నరసిం హారెడ్డి జీవిత కథ ఆధారంగా ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని ప్రారంభించా రు మెగాస్టార్ చిరంజీవి. హీరోగా 151వ చిత్రాన్ని చేస్తున్న చిరు ఇందు లో టైటిల్ రోల్‌లో నటిస్తున్నారు. దాదాపు ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్  హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదలైంది.  ఈ సినిమా కోసం ప్రత్యేకంగా నిర్మించిన సెట్స్‌లో ఈనెల 22 వరకు ఏకధాటిగా షూటింగ్ జరుగనుంది. ఈ క్రేజీ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఫైట్‌మాస్టర్ లీ విట్టేకర్ సారధ్యంలో కీలక యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. ఈ చారిత్రక చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో పలు భాషలకు చెందిన నటీనటులతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొం దిస్తున్నారు. ఇక సినిమా షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా ఈ చిత్రానికి కథ అందించిన పరుచూరి బ్రదర్స్‌లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ… చిరంజీవిని ఉద్దేశించి అద్భుతమైన ట్వీట్ చేశారు. “మీ నట జీవితంలో ఈరోజు మరుపురాని రోజు. ప్రతి భారతీయుడు నేడు పీలుస్తున్న స్వేచ్ఛా వాయువులు ఆనాడు ఎందరో మహానుభావుల ఆగిన ఊపిరిలోనుంచి అందుతున్నవే. వారిలో తొలి స్వాతంత్య్ర సమరయోధుడి పాత్రకు జీవం పోయబోతున్నారు. అందుకోండి శుభాకాంక్షలు.. అభినందనలు”అంటూ పరుచూరి గోపాలకృష్ణ చేసిన ట్వీట్ మెగా అభిమానులు అందరికీ తెగ నచ్చేసింది.

Comments

comments