Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

త్యాగానికి ప్రతీక ఏసు

doti

సిఎస్‌ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి పోచారం 

మనతెలంగాణ/బాన్సువాడ: ప్రతి మనిషి ఓపిక, సహనం, క్షమాభిక్ష, త్యాగం కలిగి ఉండాలని, త్యాగానికి ప్రతీక. శాంతిదూత యేసు ప్రభు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని బాన్సువాడ సిఎస్‌ఐ చర్చిలో ప్రసంగించారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్‌ను కట్ చేశారు. సమాజంలో దయాగుణం కలిగి ఎదుటి వారికి సహాయపడే విధంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని, అప్పుడే మనల్ని దేవు డు ముందుకు నడిపిస్తాడన్నారు. ప్రతి అడుగు వేయాలన్నా ప్రభువు దయ కలిగి ఉండాలన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని పండుగలను జరుపుకుంటుందని, ఈ సందర్భంగా పేదలకు బట్టల పంపిణీ చేయడం జరిగిందన్నారు. బాన్సువాడ నియోజకవర్గ వ్యాప్తంగా బట్టల పంపిణీ చేపట్టామన్నారు. పేద ప్రజల కష్టాలను తీర్చేందుకు దేవుడు ఎప్పుడు ఉంటాడని, మత సామరస్యానికి ప్రతీకగా ఉండాలన్నారు. దేవునిపై విశ్వాసంతో నడుచుకోవాలన్నారు. డబ్బులున్న వారు తమ పనులు తాము చేసుకుంటారని, పేదల ప్రజలకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. ప్రజలకు శాంతి సందేశాన్ని అందించేందుకు యేసు ప్రభు జన్మ ఎత్తారని, పరలోకంలో ఉన్న ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.
ఈ సందర్బంగా క్రైస్తవులందరూ ఆనందంగా పండుగను జరుపుకోవాలన్నారు. అనంతరం మంత్రిని సిఎస్‌ఐ చర్జీ తరపున ఫాస్టర్లు, నిర్వాహకులు శాలువాలు, పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిఎస్‌ఐ చర్చీ ఫాస్టర్ జ్ఞానరాజ్, ప్రశాంత్, తారా రాజేంధర్, జాన్ స్టిఫెస్, సుకుమార్, దేవయ్య, శ్యామలరావులతో పాటు ఎఎంసి చైర్మన్ నార్ల సురేష్‌గుప్త, సోసైటి చైర్మన్ ఎర్వల కృష్ణారెడ్డి, టిఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు మోహన్‌నాయక్, నాయకులు గంగాధర్, అంజిరెడ్డి, ఎజాస్, అలీముద్దీన్, బాబా, దాసరి శ్రీనివాస్, గణేష్, లింగం, రమేష్, బుల్లెట్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments