Search
Friday 25 May 2018
  • :
  • :

అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి:కోదండరామ్

kodamdaram

హైదరాబాద్: రాష్ట్రం ప్రభుత్వం నిరసన తెలిపే హక్కు లేకుండా చేస్తోందని ఐకాస చైర్మన్ ఆచార్య ప్రొ.కోదండరామ్ మండిపడ్డారు. చంచల్‌గూడ జైళ్లో ఉన్న ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను గురువారం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నిరసన తెలపడం నేరం కాదని, నిరసనలు తెలిపినందుకు బెయిల్ లేకుండా జైళ్లలో పెట్టడం సరికాదన్నారు. మండకృష్ణపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. ఎస్సి వర్గీకరణపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని కోదండరాం అన్నారు.

Comments

comments