Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

రైతులంటే ప్రభుత్వానికి చిన్నచూపు

cong2

ఎమ్మెల్సీ, శాసనసభ
ప్రతి పక్షనేత షబ్బీర్ అలీ

మన తెలంగాణ/సదాశివనగర్: రైతులంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చిన్న చూపని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 4 సంవత్సరాలు కావస్తున్నా ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని ఎమ్మెల్సీ, శాసనసభ ప్రతి పక్షనేత షబ్బీర్ అలీ అన్నారు. శనివారం మండలంలోని కుప్రియాల్ గ్రామంలో మం డల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన కార్యకర్తల చేరిక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై గ్రామంలో జెండా ఆవిష్కరణ చేసి సమావేశంలో మాట్లాడారు. 132 సంవత్సరాలుగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణ పొందుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ప్రజలందరు ప్రత్యేక తెలంగాణ కొరకు ఉద్యమాలు చేశారని ప్రత్యేక తెలంగాణ కొరకు రైతులు, విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకుంటున్నా రంటూ అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి తెలుపడంతో ఆమె  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. తరువాత ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఇచ్చిన మాట తప్పకుండా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలకు కానుకగా కాంగ్రెస్ పార్టీ  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తే తమవల్లే తెలంగాణ వచ్చిందని కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరుపున ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు పూర్తి చేసుకున్నా రైతులకు రుణ మాఫీ రాలేదని ప్రభుత్వం చెబుతున్న లెక్కలన్నీ కాకి లెక్కలేనన్నారు.  తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జరుగలేదన్నారు. డబల్ బెడ్రూమ్ , ఇంటికో ఉద్యోగం, మూడెకరాల భూమి ఇస్తామని కెసిఆర్ హామీలు ఇచ్చారని ఇందులో కేవలం రాష్ట్ర వ్యాప్తంగా 900 ఇండ్లను పూర్తి చేసి పది వేల ఇండ్లకు ఇంకా పనులు చేపట్టలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో 45 లక్షల ఇందిరమ్మ  ఇళ్లను  ఇచ్చామన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక విద్యార్థులు , రైతు లు, కార్మికులు, కర్షకులు అనేక మంది తమ జీవితాల్లో మార్పు రాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం తమ కుటుంబం తమకు అనుకూలంగా ఉన్నవారి కోసం మిషన్ కాకతీయ , మిషన్ భగీరథ పథకాలను అమలు చేసి జేబులు నింపుకుంటున్నారన్నారు. ఎన్నికల కంటే ముందు ఎలాంటి ఆదాయం లేని టిఆర్‌ఎస్ నాయకులు ఈ రోజు కోట్లకు ఎలా పడగలెత్తారని ఆయన ప్రశ్నించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోవడంలేదంటే స్థానిక ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డికి నియోజకవర్గ అభివృద్ధి కంటే తన అభివృద్దే ముఖ్యంగా భావించి కోట్లు దండుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.  అనంతరం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు సామల గంగారెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన 150 మంది కార్యకర్తలు షబ్బీర్ అలీ సమక్షంలో పార్టీలోకి చేరారు. నూతన కార్యకర్తలకు కండువా కప్పి అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి సురేష్ శట్కర్, కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్జ్ నల్లమడుగు సురేందర్ , కాంగ్రెస్ జిల్లా మహి ళా అధ్యక్షురాలు జమునా రాథోడ్, సదాశివనగర్ మండల అధ్యక్షుడ బద్దం శ్రీనివాస్ రెడ్డి, నాయకులు సుభాష్‌రెడ్డి, ఎడ్ల రాజిరెడ్డి, పండ్ల రాజు, మీర్ ఇంత్యాజ్ అలీ, మొహినుద్దీన్, అల్తాఫ్, అశోక్ రెడ్డి, లింగారెడ్డి, గంగారెడ్డి , సాయిరెడ్డి, కార్యకర్తలు ,తదితరులు పాల్గొన్నారు.

Comments

comments