Search
Sunday 21 January 2018
  • :
  • :
Latest News

కాంగ్రెస్‌లో చేరిన టిడిపి, టిఆర్‌ఎస్ నేతలు

cong

మన తెలంగాణ/గట్టు: స్థానిక బస్టాండ్ వద్ద ఎంఎల్‌ఎ డికే అరుణమ్మ అధ్యక్షతన టిడిపి పార్టి మీసాల బజారి బృందం, టిఆర్‌ఎస్ పార్టి జయ సింహ రెడ్డి బృందం సభ్యులు మొత్తం 150మందిని పార్టిలో చేరారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఎంఎల్‌ఎ కొత్తగా కాంగ్రెస్ పార్టిలో చేరిన సభ్యులకు పార్టి కండువా వేసి పార్టిలోకి ఆహ్వనించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అరుణమ్మ మాట్లాడుతు కాంగ్రెస్ పార్టి  అధికా రంలో చేపట్టిన ప్రాజేక్ట్‌లనే తాము అధికారంలోకి వచ్చాకే చేశామని టిఆర్‌ఎస్ నేతలు చేప్పుకుంటున్నారన్నారు. ప్రజలకు,రైతులకు చేసిన మేలు పలు అభివృద్ధిని చూసి టిఆర్‌ఎస్,టిడిపి  వీడి నేతలు కాంగ్రేస్‌లో చేరుతున్నారని 2019 ఎన్నికలలో భారి మేజారిటీతో కాంగ్రెస్ పార్టి గెలుపొందుతుందని ఆశ భావం వ్యక్తం చేశారు. మరో వంద మంది టిఆర్‌ఎస్ పార్టి నెతలు పార్టిని వీడి కాంగ్రేస్‌లోకి చేరబొతున్నారని తెలి పారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్‌యార్డు చేర్మన్ గడ్డం కృష్ణ రెడ్డి, కాంగ్రెస్ పార్టి మండల అధ్యక్షుడు హనుమంతు రెడ్డి,నాగేందర్ రెడ్డి,సిం గల్ విండో అధ్యక్షుడు రాములు,మోహన్ గౌడ్,మారేన్న,సర్పంచ్ సంతో షమ్మ,సంధ్య,తదితరులు పాల్గొన్నారు.

Comments

comments