Search
Friday 20 April 2018
  • :
  • :

మూడు జిల్లాలకు టిడిపి చీఫ్‌ల నియామకం

TDP

హైదరాబాద్ : తెలంగాణలోని మూడు జిల్లాలకు టిడిపి అధ్యక్షులను నియమిస్తూ తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ ఉత్తర్వులు జారీ చేశారు. టిడిపి జాతీయ అధ్యక్షుడు , ఎపి సిఎం చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు వీరిని నియమించినట్టు రమణ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాకు రాజారెడ్డి, కామారెడ్డి జిల్లాకు గోపాల్‌రెడ్డి, మంచిర్యాలకు శరత్ బాబును నియమించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడారు. తెలంగాణ టిడిపికి బలమైన క్యాడర్ ఉందని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా తాము పని చేస్తామని ఆయన తెలిపారు.

TDP Chiefs Appointment to three districts

Comments

comments