Search
Sunday 20 May 2018
  • :
  • :
Latest News

టీమిండియా ఇప్పటికీ టాపరే!

Team-India

న్యూఢిల్లీ: కోట్లా మైదానంలో సోమవారం మూడో రోజు ఫైనల్ టెస్టులో శ్రీలంక జట్టు ఆధిపత్యాన్ని కనబరిచింది. శ్రీలంక సారథి దినేశ్ చండిమాల్ 341 బంతుల్లో 147 పరుగులు చేసి సత్తా చాటాడు. అతడికి ఏంజెలో మాథ్యూస్ అండగా నిలబడి 268 బంతుల్లో 111 పరుగులు చేశాడు. వారు క్రీజులో గట్గిగా నిలబడ్డంతో భారత బౌలర్లు చివరి వరకు చెమటోడ్చారు. రవిచంద్రన్ అశ్విన్ 90 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఇషాంత్, జడేజా తలో రెండు వికెట్లు పడగొట్టారు. చివరికి వికెట్లు పడగొట్టడంతో శ్రీలంక జట్టు 130 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 7 వికెట్ల నష్టానికి 536 పరుగుల వద్ద డిక్లేర్ చేశాక, శ్రీలంక జట్టు లక్షఛేదనలో 1 వికెటు మిగిలి ఉండగా ఇంకా 180 పరుగుల లోటుతో నిలిచింది. ఆట ముగిసే సమయానికి చండిమాల్ క్రీజులో అజేయంగా 147 పరుగులతో నిలిచాడు. చండిమాల్, మాథ్యూస్ ఫాలోఆన్ నుంచి శ్రీలంకను కాపాడారనే చెప్పాలి. చండిమాల్, మాథ్యూస్ తమ భాగస్వామ్యంలో 79.1 ఓవర్లు వాడేశారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 181 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. నిలదొక్కుకున్న ఈ జోడిని అశ్విన్ విడదీశాడు. మాథ్యూస్‌ను ఔట్ చేశాడు. అప్పటికి లంక స్కోరు 256.
చెమటోడ్చిన భారత్ బౌలర్లు
శ్రీలంక జట్టు తమ పర్యటన సాంతము పేలవంగా ఆడినప్పటికీ సోమవారం మాత్రం తమకింకా బ్యాటింగ్ సత్తా ఉందని చాటుకుంది. అయినప్పటికీ భారత్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. అశ్విన్ ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేసి మూడు వికెట్లు తీసుకున్నాడు. స్పిన్నర్ల నుంచి స్వల్ప తోడ్పాటే అందింది. ఇతర ముగ్గురు బౌలర్లు సైతం చేదోడువాదోడుగా నిలిచారు. వృద్ధిమాన్ షా ఒక్కడే వికెట్ల వెనుక మూడు విలువైన క్యాచ్‌లు పట్టుకున్నాడు. అశ్విన్ తన రౌండ్‌దవికెట్ కోణంలో బంతులు వేసి మాథ్యూస్‌ను ఇబ్బంది పెట్టాడు. మాథ్యూస్ థిన్ ఎడ్జి గుండా ఆడిన బంతిని సాహ క్యాచ్ పట్టుకున్నాడు. కోట్ల పిచ్‌లో అశ్విన్ ఓవర్‌స్పిన్, సైడ్‌స్పిన్‌లకు తోడు ఆఫ్‌బ్రేక్స్ డిప్ అండ్ బౌన్స్‌లతో చెలరేగిపోయాడనే చెప్పాలి.
శ్రీలంక జట్టులో టెస్టు అరంగేట్రం చేసిన రోషన్ సిల్వా బ్యాట్‌ప్యాడ్ క్యాచ్‌తో డకౌట్ అయ్యాడు. అశిన్ వేసిన రౌండ్‌దవికెట్ ఆర్మ్ బాల్‌ను కట్ చేయబోయి నిరోశన్ డిక్వెల్లా స్టంప్ ఔట్ అయ్యాడు. 6వ బ్యాట్స్‌మన్‌గా వచ్చిన సదీర సమరవిక్రమతో కలసి చండిమాల్ 61 పరుగులు జతచేశాడు. సమరవిక్రమ 7 ఫోర్లు బాది 33 పరుగుల స్కోరు చేశాక ఇషాంత్ వేసిన వైడ్‌బాల్ ఆడబోయి ఎడ్జిలో సాహకు క్యాచౌట్ అయ్యాడు. సాహ అద్భుతంగా డైవ్‌చేసి మరీ ఆ క్యాచ్ పట్టుకున్నాడు. మరికొద్దిసేపటికి షమీ బౌలింగ్‌లో సురంగ లక్మల్ క్యాచ్‌ను కూడా డైవ్ చేసి పట్టుకున్నాడు. తొమ్మిదో బ్యాట్స్‌మన్ లాహిరు గమగెను జడేజా ఎల్‌బిడబ్లు చేశాడు. మాథ్యూస్ మూడు క్యాచ్‌లను భారత క్రికెటర్లు జారవిడుచుకున్నారు. సెకండ్ స్లిప్‌లో విరాట్ కోహ్లి, అదే పొజిషన్‌లో రోహిత్ శర్మ క్యాచ్‌ను వదిలేయగా, మురళీ విజయ్‌కు బదులుగా వచ్చిన విజయ్ శంకర్ సైతం వేళ్లను తాకిన బంతిని పట్టుకోలేక వదిలేశాడు. మాథ్యూస్‌ను తన బౌలింగ్‌తో ఇబ్బంది పెట్టినట్టుగానే చండిమాల్‌ను కూడా షమీ మొదట ఇబ్బంది పెట్టాడు. మరో ఏడు ఓవర్లు ఉండటంతో లంకను ఆలౌట్ చేయాలని టీమిండియా బౌలర్లు దాడిచేశారు. 130 ఓవర్‌కు అంపైర్లు ఆట నిలిపేయడంతో లంక జట్టు ఒక్క వికెట్‌తో ఫాలోఆన్ ప్రమాదంలో పడకుండా నిలిచిపోయింది.
స్కోరు:
భారత్ మొదటి ఇన్నింగ్స్: 536/7(127.5 ఓవర్లు)
శ్రీలంక మొదటి ఇన్నింగ్స్:
దిముత్ కరుణరత్నే(సి)సాహ(బి)షమీ 0, దిల్‌రువన్ పెరీరా (ఎల్‌బిడబ్లు)(బి) రవీంద్ర జడేజా 42, ధనంజయ డిసిల్వా (ఎల్‌బిడబ్లు)(బి) ఇషాంత్ 1, ఏంజెలో మాథ్యూస్ (సి)సాహ(బి)అశ్విన్ 111, దినేశ్ చండిమాల్(నాటౌట్) 147, సదీర సమరవిక్రమ(సి)సాహ(బి)ఇషాంత్ 33, రోషన్ సిల్వా(సి)ధావన్(బి) అశ్విన్ 0, నిరోశన్ డిక్వెల్లా(బి) అశ్విన్ 0, సురంగ లక్మల్ (సి)సాహ(బి)షమీ 5, లాహిరు గమగె (ఎల్‌బిడబ్లు)(బి) రవీంద్ర జడేజా 1, లక్షణ్ సందకన్ (నాటౌట్) 0.
ఎక్స్‌ట్రాలు: 16.
మొత్తం: 356/9(130 ఓవర్లు).
వికెట్ల పతనం: 10, 214, 375, 4256, 5317, 6318, 7322, 8331, 9343.

Comments

comments