Search
Monday 11 December 2017
  • :
  • :

దక్షిణాఫ్రికాతో టెస్టు,లంకతో టీ20లకు భారత జట్టు ఎంపిక

BCCI-2

ముంబయి: శ్రీలకంతో టీ20 సిరీస్‌తో పాటు దక్షిణాఫ్రికాతో జరిగే మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు సోమవారం బిసిసిఐ జట్టును ప్రకటించింది. అయితే లంకతో టీ20 సిరీస్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీకి బోర్డు విశ్రాంతి ఇచ్చింది. ఇప్పటికే కోహ్లీకి లంకతో వన్డే సిరీస్‌కు విశ్రాంతి కల్పించిన విషయం తెలిసిందే. టీ20 సిరీస్‌లో హైదరాబాద్ పేసర్ సిరాజ్‌కు చోటు దక్కింది. ఇంతకుముందు కివీస్‌తో ఒక టీ20 మ్యాచ్ ఆడిన సిరాజ్ మరోసారి టీమిండియాలో స్థానం దక్కించుకోవడం విశేషం. అలాగే కేరళకు చెందిన తంపి, హర్యానాకు చెందిన దీపక్ హుడా తొలిసారి భారత జట్టులోకి ఎంపికయ్యారు. విరాట్‌కు విశ్రాంతి ఇవ్వడంతో రోహిత్‌కు జట్టు పగ్గాలు అప్పగించింది. శ్రీలంకతో టీ20 సిరీస్ అనంతరం భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో కోహ్లీసేన మూడు టెస్టులు ఆడనుంది. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికాకు వెళ్లే జట్టును కూడా ఎంపిక చేసింది బిసిసిఐ.

టీ20 సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, దినేష్ కార్తీక్, ఎంఎష ధోనీ, హార్ధిక్ పాండ్యా, సుందర్, చాహాల్, కుల్దీప్ యాదవ్, దీపక్ హూడా, జస్ప్రీత్ బూమ్రా, ఎం సిరాజ్, బసిల్ తంపి, ఉనద్కత్.

టెస్టు సిరీస్‌కు టీమిండియా: విరాట్ కోహ్లీ(కెప్టెన్), మురళి విజయ్, శిఖర్ ధావన్, పుజారా, అజింక్య రహానే(వైస్ కెప్టెన్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, పార్థీవ్, హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, షమీ, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బూమ్రా.

Comments

comments