Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

తెలంగాణ సాహిత్య సాంస్కృతిక ఉత్సవాలు

ladycollector*శ్రీరంగాపురంలో నేటి నుంచి నిర్వహించే జిల్లా తెలంగాణ సాహిత్య సాంస్కృతిక ఉత్సవాలను
విజయవంతం చేయండి,
సభా వేదిక ఏర్పాట్లను పరిశీలించిన: సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కలెక్టర్ శ్వేతామహంతి

మన తెలంగాణ/శ్రీరంగాపురం: నేటి నుండి ప్రారంభమయ్యే సాహిత్య సాంస్కృతి క ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిం చాలని జిల్లా అధికార గణంతో రాష్ట్ర ప్రణాళి కా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరం జన్‌రెడ్డి, కలెక్టర్ శ్వేతామహంతిలు వేదిక ఏర్పాట్లను, నిర్మాణ పనులను పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆర్‌డిఒ చంద్రారెడ్డి, సిఐ సోంనారాయణసింగ్ వేదిక ఏర్పాట్లను
పరిశీలిస్తున్నారు. 22,23 తేదీల్లో నిర్వహిం చే తెలుగు సాంస్కృతిక ఉత్సవాలకు ప్రజలు దాదాపు 10 వేల మంది హాజరు అవుతు న్నట్లు వారు వివరించారు. ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని విద్యుత్, మౌళిక సదుపాయాలు, స్టాల్స్, పుస్తక ప్రదర్శనశాల, వైద్య సదు పాయం, రవాణా, పోలీస్ వ్యవస్థ బందోబస్త్, ఈవెంట్ మేనేజర్లు, వనపర్తి జిల్లాలో జరిగే ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలని, జిల్లాకు మంచిపేరు తీసుకురావా లని కలెక్టర్ అధికారులను ఆదేశిం చారు. నేడు ప్రారంభమయ్యే తెలు గు మహాసభలకు మంత్రులు జూపల్లి కృష్ణారావు లకా్ష్మరెడ్డి, పర్యాటక శాఖా మాత్యులు చందూలాల్, ఎంఎల్‌ఎ చిన్నారెడ్డి, జడ్పిచైర్మన్ బండారి భాస్కర్, ఎంపి జితేందర్‌రెడ్డి, ఎంఎల్‌ఎలు ఆల వెంక టేశ్వర్‌రెడ్డి, చిట్టెం రాంమ్మోహన్‌రెడ్డిలు ,ఎంఎల్‌సిలు హాజరు అవుతున్నట్లు కలెక్టర్ శ్వేతామహంతి, ఎస్‌పి రోహిణి ప్రియదర్శిని తెలిపారు. మహాసభలకు శాంతి భద్రతల దృష్టా గట్టి బందోబస్త్ నిర్వహిస్తున్నట్లు ఎస్‌పి తెలిపారు. కోలాట ప్రదర్శనలు, పేరిణి నృత్యం, పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు సాహితీవేత్తల ఉపన్యాసాలు, ప్రసంగాలు, రెండు రోజుల పాటు తెలుగు భాషా ఔన్నత్యాన్ని ప్రపంచ స్థాయిలో తెలిపేందుకు  ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా జిల్లా స్థాయి తెలుగు సాహిత్య మహాసభలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్వేతామహంతి తెలిపారు. ఉచిత రవాణా సదు పాయాలు, వనపర్తి నుండి, పెబ్బేరు , పెబ్బేరు నుండి శ్రీరంగాపురం వరకు రవాణా సదుపాయాలుంటాయని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరు తెలుగు మహాసభల్లో పాల్గొనాలని కలెక్టర్ శ్వేతామహంతి, ఎస్‌పి. రోహిణిప్రియద ర్శినిలు జిల్లా ప్రజలు,సాహితీవేత్తలు , కవులు ,గాయకులు ,తెలుగు భాషాభి మానులు,  వివిధ మండలాల ప్రజలను పాల్గొనాలని వారు తెలిపారు. వేదిక ఏర్పాటు కార్యక్రమంలో   ఆర్డీఒ చంద్రారెడ్డి, డిఆర్‌డిఒ గణేష్, సిఐ సోంనా రాయణసింగ్, తహశీల్దార్ శ్రీనివాస్‌రావు, సర్పంచ్ వెంకటస్వామి,జలీల్ ,గౌడ్‌నాయక్,మార్కెట్ చైర్మన్‌బుచ్చారెడ్డి,పృథ్వీరాజ్, పర్వతాలుపాల్గొన్నారు.

Comments

comments