Search
Sunday 20 May 2018
  • :
  • :
Latest News

మహిళకు అవమానంలో…. మనం నెంబర్ 2

మొదటిస్థానంలో ఎపి, రెండో స్థానంలో తెలంగాణ

   Rape

మన తెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా 2016లో చోటుచేసుకున్న నేరాలు, బాధితులు, కేసుల నమోదు తదిత రాలపై జాతీయ క్రైమ్ రికార్డు బ్యూరో వార్షిక నివేదికను విడుదల చేసింది. ఇందులో ఎక్కువ నేరాలు ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ తదితర రాష్ట్రాల్లో నమోదయ్యాయి. మహిళలను అవమానించే నేరా ల్లో ఆంధ్రప్రదేశ్ (1831 సంఘటనలు) తొలి స్థానంలో ఉంటే తెలంగాణ ఆ తర్వాతి స్థానంలో ఉంది. ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం పరిధిలోకి వచ్చే కేసులు బెం గళూరు నగరంలో అత్యధికంగా 199 నమోదు కాగా ఆ తర్వాత నగరం హైదరాబాదే (102 కేసులు, 121 మంది బాధితులు). ఇందులో 92 మంది ఎస్సీ బాధితులుకాగా, ప ది మంది ఎస్టీలు. రాష్ట్రం మొత్తంమీద 1088 జూదం కేసు లు నమోదైతే ఇందులో 210 హైదరాబాద్ నగరంలోనే చో టుచేసుకున్నాయి.

54 నకిలీ నోట్ల చెలామణి కేసులు రా ష్ట్రంలో నమోదైతే 23 హైదరాబాద్ నగరంలోనే. రాష్ట్రం మొత్తంమీద పన్నెండువేల పైచిలుకు దొంగతనాలు నమోదై తే హైదరాబాద్ నగరంలో మూడువేలు ఉన్నాయి. దాదాపు నాల్గింట ఒకవంతు కిడ్నాప్ కేసులు హైదరాబాద్ నగరం లోనే నమోదయ్యాయి. మహిళలను లైంగికంగా వేధిస్తున్న కేసులు రాష్ట్రం మొత్తంమీద 859 నమోదైతే అందులో 151 నగరంలోనే.

ఐపీసీ కింద నమోదైన నేరాలు: 1,08,991
స్పెషల్ లోకల్ చట్టాల కింద నేరాలు: 11,282
హత్యలు : 1046 (1067 మంది మృతులు)
రాష్ డ్రైవింగ్: 16881 (7283 మంది మృతి, 19065 మంది గాయాలు)
వరకట్నం కేసులు : 254 (254 మంది మృతులు)
మహిళలపై నేరాలు : 3767 (3801 మంది బాధితులు)
లైంగిక వేధింపు : 859 (860 మంది బాధితులు)

కిడ్నాప్‌లు: 1302 (1326 మంది బాధితులు)
పెళ్ళి కోసం మహిళల కిడ్నాప్‌ల : 260 (261 మంది బాధితులు)
మహిళలపై నేరాలు : 15,374
అత్యాచారాలు : 1278 (1278 మంది బాధితులు)
సామూహిక అత్యాచారం : 15 (15 మంది బాధితులు)
మహిళపై భర్తలు/బంధువుల అకృత్యాలు: 7202 (7206 మంది బాధితులు)
మహిళలను అవమానించడం : 1003 (1011 మంది బాధితులు)

వివాహేతర సంబంధాలతో హత్యలు : 104
మానవ (పెద్దలు) అక్రమ రవాణా : 41 (139 మంది బాధితులు)
చిన్నపిల్లల అక్రమ రవాణా : 229 (390 బాధితులు. ఇందులో 368 మంది బాలికలు. లైంగిక అవసరాల కోసం)
మిస్సింగ్ బాలలు : 4700 మంది
మహిళల అక్రమ రవాణా : 9 (13 మంది బాధితులు)
చిన్నపిల్లలపై నేరాలు : 2909
ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం : 480 (529 మంది బాధితులు)
దేశద్రోహం : 2 (ఇద్దరు బాధితులు)

దొంగతనాలు : 12,634 (12,939 మంది బాధితులు)
బలవంతపు వసూళ్ళు : 361 (372 మంది బాధితులు)
ఆర్థిక నేరాలు : 27,946 (28,271 మంది బాధితులు)
నకిలీ నోట్ల చెలామణి : 54 కేసులు
ఆయుధ చట్టం కేసులు : 89
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసులు : 701
మాదక ద్రవ్యాల సంబంధ కేసులు : 232

జూదం కేసులు : 1088
వెట్టిచాకిరీ కేసులు : 11
ఎస్సీ, ఎస్టీలపై వివిధ రకాల నేరాలు : 1529
ఎస్సీ, ఎస్టీ మహిళలపై నేరాలు : 83
వృద్ధులపై నేరాలు : 1382
అవినీతి నిరోధక నేరాలు : 89
ఆర్థిక నేరాలు : 9286
సైబర్ నేరాలు : 593
విదేశీయులపై దాడులు : 4
నేరాలకు పాల్పడిన విదేశీయులు : 25

Comments

comments