Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు

games
మనతెలంగాణ/మెదక్ టౌన్ : క్రీడాకారులు ఉన్నతమైన స్థానికి చేరుకోవాలంటే క్రీడల ద్వారానే సాధ్యమని మెదక్ హెడ్‌పోస్టాఫీస్ ఉన్నతాధికారి వి. నాగేశ్వర్ అన్నారు. శనివారము నాడు పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 4వ తెలంగాణ రాష్ట్ర సబ్‌జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. అండర్ 10, అండర్ 12, అండర్ 14 విభాగాలుగా సూమారు 400 మంది బాలిబాలికలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి హెడ్‌పోస్టాఫీస్ ఉన్నతాధికారి వి. నాగేశ్వర్ మాట్లాడుతూ… క్రీడలలో బాలబాలికలు రాణించి మన జిల్లాను రాష్ట్ర, దేశంలోనే కాకుండా ప్రపంచ నలుమూలకు చాటేందుకు కృషి చేయాలన్నారు. ఈ జిల్లా సెలక్షన్‌లో 22 మంది క్రీడాకారులు వచ్చే నెల హైదరాబాద్‌లో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు అథ్లెటిక్స్ సెక్రటరీ మధు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఎస్‌సి బోస్, పిఇటిలు సుజాత, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments