Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో తీర్చిదిద్దుతా

speakerమనతెలంగాణ/భూపాలపల్లి ప్రతినిథి/రేగొండ: తెలంగాణ రాష్ట్రంలోనే జయశంకర్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి కృషిచేస్తానని స్పీకర్ సిరికొండ మధుసూదనచారి అన్నారు. శనివారం భూపాలపల్లి పట్టణ కేం ద్రంలోని భారత్ ఫంక్షన్‌హాల్లో మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి స్పీకర్ పాల్గొన్నారు. 10వ తరగతి చదువుతున్న 500మంది అనాథలకు స్టడీ మెటీరియల్, ఎగ్జామ్ కిట్స్‌ను పంపిణీచేశారు. అలాగే  రేగొండ మండలంలోని రామన్న గూడేంలో డబుల్ బెడ్‌రూం ఇండ్లనిర్మాణాలకు  శంకుస్థాపన చేశారు. నారాయణపురం గ్రామంలో గొల్ల కురుమల అభివృద్దికి ప్రభు త్వం అందించిన గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువులో ఉన్నతంగా రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలను సూచించారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని అన్ని మండల గ్రామాల్లో ఉన్న నిరుపేదఅందరికి డబుల్ బెడ్‌రూంఇండ్ల పథకం వర్తించే విధంగా పాటుపడుతానన్నారు. తెలంగాణ ప్రభుత్వం కుల వృత్తుల సంక్షేమానికి చేయూత నందిస్తూ ఆర్థికంగా బలపడేలా సీఎం కేసిఆర్ ఒక లక్షంతో పథకాలను  అందిస్తున్నారని తెలిపారు. పేదలకు ఇండ్లు నిర్మించాకే నేను ఇల్లు కట్టుకుంటానని స్పష్టం చేశారు. 70 ఎండ్లలో గత పాలకులు చేయ్యని అబివృద్ది మూడున్నర సంవత్సరాల్లో చేసి చూపించామని వెల్లడించారు. పాండవుల గుట్ట ప్రాంతంలో భూదాతలు ఎవరైన తక్కువ రేట్లో భూమి విక్రయించినట్లయితే కొనుగోలు చేసి వృద్దాశ్రమం నిర్మిస్తామని స్పీకర్ వెల్లడించారు. ఈకార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు సిరికొండ క్రాంతి కుమార్, నగర పంచాయితి చైర్ పర్సన్ బండారి సంపూర్ణ రవి,ఎంపిపి రఘుపతిరావు, టీఆర్‌ఎస్ నాయకులు రవీందర్ రెడ్డి, సాంబమూర్తి, మేకల సంపత్, పైడిపల్లి రమేష్, మోడెం ఉమేష్ గౌడ్, పున్నం రవి, శ్రీధర్, రాజిరెడ్డి, బిక్షపతి, మనోహర్ రావు, రాంరెడ్డి, శ్రీనివాస్, సంతోష్,  అధికారులు పాల్గొన్నారు.

Comments

comments