Search
Friday 20 April 2018
  • :
  • :

తలాక్‌పై కేంద్ర నిర్ణయం చారిత్రాత్మకం

sit

బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి
మనతెలంగాణ/పెద్దపల్లి:ముస్లిం సమాజంలో కొనసాగుతు న్న తలాక్‌ను నేరంగా పరిగనిస్తూ కేంద్రం పార్లమెంట్‌లో చేసి న చట్టం చారిత్రాత్మక నిర్ణయమని పెద్దపల్లి మాజీ శాసన స భ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి అన్నారు.శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావే శంలో మాట్లాడుతూ ముస్లిం సమాజంలో మహిళల ఇష్టా ఇ ష్టాలతో ప్రమేయం లేకుండా పురుషులు ఏకపక్షంగా మూడు సార్లు తలాక్ అని చెప్పడం ద్వారా విడాకులు పొందే పద్దతి వల్ల మహిళలకు అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్య క్తం చేశారు.కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ మానవీయ కోణంలో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ముస్లిం మహిళలకు న్యాయం జరిగిందని అన్నారు.
ఈ బిల్లు ముస్లిం మతానికి వ్యతిరేకం కాదని ముస్లిం మహి ళలకు దేశంలోని ఇతర మతాల మహిళలలతో సమానంగా హక్కుల్ని ప్రసాధించే గొప్ప కార్యక్రమమని అయన కొనియా డారు.వ్యక్తులు,మతాలతో సంబందం లేకుండా అందరూ ఈ చారిత్రాత్మక నిర్ణయానికి మద్దతు తెలపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు కొంతం శ్రీనివాస్ రెడ్డి,నాయకులు కర్ర సంజీవ రెడ్డి,పుట్ట మొండి,పల్లె సదానం దం,ఠాకుర్ రాజు సింగ్,స్వతంత్ర కుమార్,మల్లారెడ్డి,అక్కన పెల్లి క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments