Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

కాంగ్రెస్ బలోపేతానికి కంకణ బద్ధులు కండి

cong2మనతెలంగాణ/యాదాద్రి : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కంకణ బద్ధులు కావాలని తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆలేరు ప్రజల అభివృధ్ధి కోసం నిరంతరం కృషి చేసే భిక్షమయ్యగౌడ్‌ను అధిక మెజారిటితో వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రావణ్ మాట్లాడుతూ ఆనేక వర్గాల ప్రజలు తమ బతుకులు బాగు పడు తాయని సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యాన్ని కేసిఆర్ మరిచాడని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రావణ్‌కుమార్ అన్నాడు. సంక్షేమ పథకాల పేరుతో అవినీతి అక్రమాలకు పాల్పడుతూ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మారుస్తున్నాడని విమర్శించారు. గ్రామానికి ఒక్క మంచినీటి వాటర్ ఫిల్టర్‌ను ఏర్పాటు చేసి త్రాగు నీరు ఇస్తే 2 వేల కోట్లు ఖర్చు అవుతాయని కానీ ఇంటికో నల్లా ఇస్తామని 45 వేల కోట్లు ఖర్చు అవుతాయని అయిన త్రాగు నీరు అందే పరిస్థితి లేదని అన్నారు. కేసిఆర్ పాలనలో ప్రజలను మాయ మాటలతో మోసం చేసాడు తప్ప పేదలకు ఒరిగింది ఏం లేదని అన్నారు. మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు అనేక వాగ్ధానా లు చేసిన కేసిఆర్ అమ లు పరచకుండా ప్ర జా సంక్షేమం లేని పాలన సాగిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్ అన్నారు. తెలంగాణ ప్రజ లు ఆశించిన ప్రత్యేక రాష్ట్ర ఫలాలు ప్రజలకు అందలేదని 2019 ఎన్నికల్లో కాంగ్రేస్ అధికా రంలోకి వచ్చాక కాళీగా ఉన్న ఉద్యో గాలు భర్తీ చేసి ప్రజల సంక్షేమానికి పని చేస్తుందని అన్నారు. ఆలేరు నియోజక వర్గ ప్రజల కోసం నిరంత రం అందు బాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ప్రజా గాయకడు ఏపూరి సోమన్న మాట్లా డుతూ ప్రజా ఆంక్షలను విస్మరిస్తూ సాగిస్తున్న కేసిఆర్ దొరల పాలనకు ప్రజలు చరమ గీతం పాడక తప్పదని ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న అన్నారు. తన కళ బృందంతో కలిసి సభలో ఆటపాట సాగించి ఆకట్టు కున్న సోమన్న మాట్లాడుతూ నైజాంను వ్యతిరేకించి పోరాడిన తెలంగాణ ప్రజలకు కేసిఆర్ దొరను గద్దె దిం చేది కష్టం కాదని అన్నారు. మోస పూరి త వాగ్ధా నాలతో ప్రజలను మోసం చేస్తున్న పాల నను ప్రజలు ఎండగడుతారని అన్నారు. ప్రముఖ టీవి యాం కర్ తీన్మార్ మల్లన్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగా ణ చేస్తామన్న ముఖ్యమంత్రి కేసిఆర్ అప్పుల తెలం గాణగా మార్చడాన్ని ప్రముఖ టీవి యాంకర్ తీన్మార్ మల్లన్న ప్రభుత్వాన్ని విమర్శించారు. తెలం గాణ కోసం చనిపోయిన కుటుంబాలను ఆదుకోలేదని యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని రైతులకు సరైనా రుణమాఫీ లేక అప్పులతో ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించు కోవ డం లేదని అన్నారు. ప్రజా సంక్షే మా న్ని అమలు చేయ కుండా లక్షల కోట్లు అప్పు చేసి ప్ర జలపై భారం మోపుతున్నాడే తప్ప పేద ప్రజలకు చేసింది ఏమి లేదని అన్నారు.
ఆకట్టుకున్న బైక్ ర్యాలీ
వంగపల్లిలో నిర్వహించిన సభకు యాదగిరిగుట్ట మం డల కేంద్రం నుండి సభ వేదిక వరకు వందలాది మంది కార్యకర్తలతో భిక్ష మయ్య గౌడ్ బైక్ ర్యాలీ ప్రజలను ఆకట్టుకుంది. కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతన ఉత్తేజం నింపింది.
చేరికలు
భిక్షమయ్యగౌడ్ ఆధ్వర్యంలో సుమారు వంద మందికిపైగా యువకులు కాంగ్రెస్‌లో చేరగా ఉత్తమ్ కుమార్‌రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వా నించారు.

Comments

comments