Search
Saturday 20 January 2018
  • :
  • :
Latest News

కాంగ్రెస్‌కు అన్ని మంచి రోజులే

show

మనతెలంగాణ/భైంసా: రానున్న రోజులన్ని కాంగ్రేస్ కి మంచి రోజులేనని మాజీ మంత్రి, శాసన మండలి ప్రతిపక్ష నేత శబ్బిర్ అలీ అన్నారు. పట్టణంలోని ఎస్‌ఎస్ జిన్నింగ్ మిల్లులో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు. రాహుల్ గాంధీ ఏఐసిసి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టగానే గుజరాత్ ఎన్నికల్లో అధికారం చేపట్టకున్నా మంచి ఫలితాలు వచ్చాయన్నారు. 2014 ఎన్నికల్లో 2జీ స్కాం పై కాశ్మీర్ నుండి కన్యకూమారి వరకు బీజేపి నాయకులతో పాటు సంఘ్ పరివార్ ప్రచారం ని ర్వహించి అధికారం చేపట్టగా, తాజాగా కోర్టు 2జీ స్కాంలో నాయకులను నిర్దోశులుగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ రా వ్ చౌహన్ పై ఆదర్శ హౌజింగ్ కుంభకోణాన్ని కోర్టు కొట్టి వేసిందని చెప్పారు. దీంతో 2జీ స్కాం పై ప్రధాని మోడి, అమీత్‌షా చేసిన ప్రచారం కోర్టు తీర్పుతో తప్పని తేలిందన్నారు. ఈ ప్రచారంతోనే కేంద్రంలో బీజేపి ఆధికారం చేపట్టిందని అన్నారు. 2019 ఎన్నికల్లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నరు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రేస్ పార్టీయే అన్నారు. అప్పట్లో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ వద్దకు కేసిఆర్ కుటుంబ సమేతంగా వెళ్లి కృతజ్ఞతలు చెప్పి బయటకు వచ్చి తానే తెలంగాణ తెచ్చినట్లు చెప్పుకున్నారు. తెలంగాణ కోసం యువకుల ఆత్మహత్యలు,  ఊస్మానియ విద్యార్థుల ఆందోళనతో అప్పటి యుపిఎస్ చైర్‌పర్సన్ చలించి ఇలాంటి సంఘటనలు జరుగ వద్దని తెలంగాణ ఇచ్చిందన్నా రు. ఇంటికో ఉద్యోగం అని అధికారం చేపట్టిన కేసిఆర్ ప్రస్తుతం విస్మరించడంతో ఊస్మానియ యూనివర్శిటీలో అడుగు పెట్టలేని పరిస్థితి ఏ ర్పడిందన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన సా గుతుందని బీయ పట్టారు. దళితులకు మూడెకురాల భూమి అని చెప్పి విస్మరించారని బీయ పట్టారు. ఎంఎల్‌ఏ విఠల్ రెడ్డి గెలిచిన వెంటనే టీఆర్‌ఎస్‌లో చేరడాన్ని ఆయన తప్పు పట్టారు. ఆ యన తండ్రి మాజీ మంత్రి గడ్డెన్న నాలుగై దు దశాబ్దాలు కాంగ్రేస్ పార్టీలో ఉన్న విషయా న్ని గుర్తుచేశారు. ముథోల్ నియోజక వర్గంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ గెలుస్తుందన్నా రు. రామరావ్ పటేల్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన కొనియాడారు. ఈ సందర్భ ంగా పిసిసి సభ్యులు రామరావ్ పటేల్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి లు షబ్బీర్ అలీకి మెమొంటో అందచేశారు. ఈ కా ర్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి, అనసూయ పవర్ ట్రస్ట్ చైర్మన్ రామరావ్ పటేల్, ఉమ్మడి జిల్లా నాయకులు భార్గవ్ దేశ్ పాండే, అనిల్ జాదవ్, హరినాయక్, మాజీ మున్సిపాల్ చైర్మన్ గంగాధర్, మాజీ వైస్ చైర్మ న్ లింగురాం, మైనార్టి నాయకులు ఫిరోజ్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments