Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

సమస్యల పరిష్కారానికి పోరాడేదే సిపిఐ

cpi2

మన తెలంగాణ/యాదాద్రిభువనగిరి : అనునిత్యం ప్రజలు ఎదుర్కొనే ప్రజాసమస్యలు పరిష్కారానికి నిరంతరం పోరాడేదే భారత కమ్యునిస్టు పార్టీ ( సిపిఐ) ఒక్కటేనని సిపిఐ మండల కార్యదర్శి ఏశాల అశోక్ అన్నారు. జిల్లాకేంద్రంలో గల సిపిఐ కార్యాలయం లో పార్టి 92వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని బుదవా రం ఆయన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఐ పార్టీ 1925 డిసెంబర్ 26వ తేదీన భారత దేశంలో ఏర్పడిందని నాటి నుండి నేటి వరకు అనేక ఆటుపోట్లను ఎదుర్కొని మొక్కవోని దీక్షతో ప్రజల పక్షాన నిలబడిందన్నారు. ఎందరో త్యాగమూర్తుల త్యాగాలతోనే పవిత్రమైన ఎర్రజెండా ఒక్కటే కష్టజీవులకు అండగా ఉన్నా సిపిఐ జెండాను ప్రజలు ఆదరించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. అదే విధంగా మండలంలోని బస్వాపురం, అనంతారం, బొమ్మాయిపల్లి తదితర గ్రామాలలో గ్రామ శాఖ కార్యదర్శులు వేరు-వేరుగా జెండా ఆవిష్కరణ చేశారు. ఈ వ్యవస్థాక దినోత్సవం కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఇమ్రాన్, సిపిఐ పట్టణ కార్యదర్శి శ్యామల శోబన్‌బాబు, పట్టణ కమిటీ సభ్యులు చిక్క నర్సయ్య, దాసరి లక్ష్మయ్య, ఆయా గ్రామాల శాఖల కార్యదర్శులు పురం పోశాలు, ముదిగొండ రాములు, సోమన అయిలయ్య, దొడ్డి బాలయ్య, బద్దం వెంకట్‌రెడ్డి, రాసాల పెంటయ్య, నోముల అయిలయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments

comments