Search
Saturday 20 January 2018
  • :
  • :
Latest News

పాలకుల నిర్లక్ష్యం వల్లే శిథిలమైన ఫ్లైఓవర్ బ్రిడ్జి

BRIDGE

మన తెలంగాణ/మహబూబాబాద్ ఎడ్యుకేషన్ : పాలకుల నిర్లక్షం వల్లే మహబూబాబాద్ ఫ్లైఓవర్ బ్రిడ్జి శిథిలావస్థలో ఉందని మహబూబాబాద్ పట్టణ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షులు సప్పిడి రంజిత్ అన్నారు. శుక్రవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఫ్లైఓవర్ బ్రిడ్జిపై శిథిలావస్థలో ఉన్న గుంతల వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిడ్జిపై నుంచి వందలాది వాహనాలు రాకపోకల ద్వారా బ్రిడ్జిపై వేసిన నాసిరకం కాంక్రీటు కొట్టుకపోయి గుంతల మయంగా మారిందని ఆరోపించారు. ఆ గుంతలు వచ్చిపోయే వాహన దారులకు ఇబ్బందికరంగా ఉందన్నారు. బ్రిడ్జిపై నెలకొన్న గుంతల వద్ద అనేక సార్లు యాక్సిడెంట్లు, ప్రమాదాలు జరిగాయన్నారు. సంబంధిత అధికారులకు చెప్పినా ఏ మాత్రంకూడా పట్టించుకోవడంలేదని విమర్శించారు. బ్రిడ్జి నిర్మించిన 15సంవత్సరాలకు శిథిలావస్థకు చేరిందన్నారు. పాలకులు, కాట్రాంక్టర్ల స్వార్థం కోసం ఫ్లైఓవర్ బ్రిడ్జిని నాసీరకంగా నిర్మించి చేతులు  దులుపుకున్నారని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు శిథిలమైన గుంతల వద్ద మరమ్మత్తులు చేసి ప్రమాదాలను నివారించాలని కోరారు. లేని యేడల బ్రిడ్జిపై ప్రమాధాలు జరిగితే సంభందిత అధికారులు, పాలకులు బాధ్యత వహించవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సిపి జిల్లా ప్రధాన కార్యదర్శి కాజా, కోమిటి నవీన్, వైఎస్‌ఆర్‌సిపి మైనార్టీ జిల్లా అధ్యక్షులు జహీద్, అనిల్, సాదీప్, రాంబాబు, విజయ్ పాల్గొన్నారు.

Comments

comments