Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

ఉపాధిహామీ మేట్లను తొలగించడానికి డిఆర్‌ఒకు వినతి

letterమన తెలంగాణ/నిర్మల్‌టౌన్: వినతిపత్రం అందజేస్తున్న తెలంగాణ వ్యవసాయ కార్మికసంఘం నాయకులు ఉపాధి హామీ పథకంలో కీలక పాత్ర పోసిస్తున్న ఉపాధిహామీ మేట్లను తొలగించేందుకు జిఒ నెంబర్ 1786 ను రద్దు చేయాలని కోరుతూ గురువారం డిఆర్‌ఒ ధర్మయ్యకు తెలంగాణ వ్యవసాయ కార్మికసంఘం ఆధ్వర్యంలో నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్ మాట్లాడారు. గత 10 ఏళ్ళగా ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న 3,80,910 మెట్లను గ్రూప్‌ల్లో మార్పులు, చేర్పుల పేరుతో 20 మందితో ఉన్న గ్రూప్‌లను పాత గ్రూప్ సభ్యులను కలిపి 40 మందికి ఒక గ్రూప్ సోసైటిగా ఏర్పాటు చేసి పర్మినెంట్ మేట్లను తొలగించే పద్ధతిని వెనకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే సామాజిక తనిఖీల్లో ఏవైన అవకతవకులు జరిగితే మేట్లను, జాబ్‌కార్డ్‌లను సం॥ నుంచి 3 ఏళ్ళ వరకు పనులు చేయకుండా తొలగిస్తున్నారన్నారు. దీంతో వారి కుటుంబం రోడ్డు పడుతుందన్నారు. జిఒ నెంబర్ 1786 ను వెంటనే రద్దు చేసి మేట్లను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి వేతనాలు చెల్లించాలన్నారు. అలాగే పెండిగ్‌లో ఉన్న కూళీల డబ్బులు వెంటనే చెల్లించాలన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో జిల్లా అధ్యక్షులు గున్నల సధాంద్, జిల్లా కోశాధికారి డాకూరి దిరుపతి, జిల్లా ఉపాధ్యక్షురాలు బి.రజిత, పోసవ్వ, దుర్గం పోశలింగం, దేవభోజన్న, జిల్లా కార్యదర్శి ఇప్ప లక్ష్మణ్, దుర్గం లింగన్న తదితరులు పాల్గొన్నారు.

Comments

comments