Search
Friday 20 April 2018
  • :
  • :

నకిలీ విత్తనాల కలకలం!

farmer
*మొలకెత్తని మొక్కజొన్న విత్తనాలు
*అన్నదాతల ఆందోళన

మనతెలంగాణ/రాయికల్: అధికారుల పర్యవేక్షణ లోపం అన్నదాతల పాలిట శాపమైంది. ప్రైవేటు విత్తనాల డీలర్ల మోసాలకు రైతులు బలైయ్యారు. మళ్లీ నకిలీ విత్తనాల ఉదంతం రాయికల్ మండలం రామాజీపేట గ్రామంలో వెలుగు చూసింది. పలువురు రైతులు ఈ రబీ సీజన్‌కు దుక్కుల్లో విత్తిన మొక్కజొన్న విత్తనాలు మొలకెత్తక రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఖరీఫ్ సీజన్‌లో అధికారులు విత్తన దుకాణాలను తనిఖీ చేసి పెద్ద ఎత్తున విత్తనాలను సీజ్ చేయడంతో రైతులకు ఇబ్బంది తలేత్తలేదు. ఎక్కడ కూడ విత్తనాలు మొలకెత్తలేదనే ఆరోపణలు రైతుల నుండి వినబడలేదు. అయితే ఈ రబీ సీజన్‌కు అధికారులు దుకాణాల వైపు కన్నేత్తి చూడకపోవడంతో చాల మంది దుకాణ యజమానులు తమ ఇష్టమొచ్చిన విత్తనాలు తీసుకొని రైతులకు అంటగట్టారు. ఏం తెలియని రైతులు అట్టి విత్తనాలు తీసుకొని సాగుభూమిలో వేయగా అవి మొలకెత్తక ఇబ్బంది పడుతున్నారు.
మండలంలోని రామాజీపేట గ్రామానికి చెందిన ఎనిగంటి బాలయ్య, నర్సయ్య, గణేష్ అనే రైతులు ఈ రబీ సీజన్‌కుగాను రాయికల్‌లోని ఓ ప్రైవేటు విత్తన దుకాణంలో ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన మొక్కజొన్న విత్తనాలను రూ.1050లను చెల్లించి తీసుకువచ్చి భూమిలో వేసారు. ఎప్పటిలాగే నీటిని అందించారు. 20 రోజులు గడిచిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో సదరు దుకాణ యాజమానిని నిలదీసారు. దుకాణా యాజమాని కంపెనీ ప్రతినిధులను రప్పించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వెళ్లారే తప్ప రైతులకు న్యాయం చేసే మాటలు చెప్పకపోవడంతో బాధిత రైతులు మండల వ్యవసాయాధికారి అనిల్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఆయన విత్తనాలను వేసిన భూమిని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదించారు.
దుక్కులు దున్నించడం, కూలీల ఖర్చు, ఎరువులు, ఇతరత్రా ఎకరాకు రూ.15 వేల వరకు ఖర్చులు అయ్యాయని రైతులు ఆవేదన చెందారు. మళ్లీ విత్తనాలు వేసి పంటల సాగుకు పూనుకుందామంటే సమయం గ డిచిపోయిందని తాము సీజన్ నష్టపోయామని రైతులు అధికారుల దృ ష్టికి తీసుకెళ్లారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి తమకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Comments

comments