Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షం

open

 *నుంచి రైతాంగానికి 24 గంటలు ఉచితంగా విద్యుత్ 

 రాష్ట్ర  గృహ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

 మన తెలంగాణ/దిలావర్‌పూర్: రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే భావనతో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖర్ రావు రైతు మేలు కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర న్యాయ, గృహనిర్మాణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోమవారం దిలావర్‌పూర్ మండ లంలోని గుండంపల్లి గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్టు 27 ప్యాకేజీ ఎత్తి పోతల పథకం కింద రూ 3 కోట్ల 32 లక్షలతో నిర్మించనున్న 33/11 కెవి సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన చేశారు. వచ్చే సంవత్సరం నుంచి ఎస్‌ఆర్‌ఎస్‌పిలో పుష్కలంగా నీరుంటుందని కాళేశ్వరం ప్రాజెక్టు 27వ ప్యాకేజీ ద్వారా నిర్మల్ నియో జకవర్గంలోని 50వేల ఎకరాలకు, 28వ ప్యాకేజీద్వారా ముథోల్ నియోజకవర్గానికి 50వేల ఎకరాలకు అద నంగా నీరు అందుతుందన్నారు. వచ్చే జనవరి 1 నుండి రైతాంగాని కి 24 గంటలు విద్యుత్ ఉచితంగా సర ఫరా చేయనున్నట్లు మంత్రి తెలి పారు. ఆటోమెటిక్ స్టార్టర్ పెట్టు కున్న రైతులు స్టార్టర్‌లను తీసివేయా లని సూచించారు. గతంలో కరెంట్ సక్రమంగా కానుందున రైతులు ఆటోమెటిక్ స్టార్టర్‌లను పెట్టుకున్నారని, ఇప్పుడు ఆ అవకాశం లేద న్నారు. రైతులకు మేలు చేయాలన్న సంక ల్పంతో భూసార పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేసి మట్టి పరీక్షలు నిర్వ హించి ఏ భూమికి ఏ పంట పండుతుందనే విషయాన్ని వ్యవసాయ అధికారులు రైతులకు సూచిస్తా రన్నారు. ప్రతీ 5వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించి రైతులకు సలహాలు, సూచనలు అందించడం జరుగుతుం దన్నారు.రైతుసంతోషంగాఉంటేనే రాష్ట్రంఅభివృద్ధి జరుగుతుందన్న భావనతోనే వచ్చే జూన్‌నుండి ప్రతీ ఎకరానికి రూ.4వేల చొప్పున రెండు పంటలకు సంవత్సరానికి 8వేలు పెట్టుబడిని ప్రభుత్వమే అంద జేయ నుందన్నారు.ఆరుసబ్‌స్టేషన్ల నిర్మాణానికి పాలనపరమైన అను మతులు మంజూరయ్యాయని తెలిపారు. గుం డంపల్లిలో నిర్మించనున్న 33/ 11కేవీ సబ్ స్టేషన్‌ను 3నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు. నీటి పారు దలశాఖ ఈఈ రామారావ్ మాట్లాడుతూ నిర్మల్ నియోజక వర్గం లోని 50వేల ఎకరాలకు సాగు నీరందించే 27వ ప్యాకేజీ పనులను త్వరంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని, వచ్చే జూన్ ఖరీఫ్‌వరకు 13వేల ఎకరాలకు 27వ ప్యాకేజీ ద్వారా నీరందిస్తామని తెలిపారు. ఈ కార్య క్రమంలో నిర్మల్, సారంగాపూర్ వ్యవసాయ మార్కెట్ అధ్యక్షుడు దేవేందర్‌గౌడ్, రాజ్‌మహ్మద్, ఎఫ్‌ఏసీఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, మున్సి పల్‌చైర్మన్ అప్పాల గణేష్‌చక్రవర్తి, టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్య నారాయణ గౌడ్, కడిలి, అడెల్లి దేవ స్థానాల చైర్మన్‌లు, దిలావర్‌పూర్ ఎంపీపీలక్ష్మి, వైస్‌ఎంపీపీ జీవన్‌రావ్, వ్యవసాయ అధికారి అమ రేష్‌కుమార్, కౌన్సిలర్లు, ఇరిగేషన్, విద్యుత్‌శాఖ డిఇలు సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు. 

Comments

comments