Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్వేయం

rice*సాగుకు 24 గంటల కరెంటు
*కందులకు రూ. 5450 మద్దతు ధర
*మంత్రి మహేందర్‌రెడ్డి

మన తెలంగాణ/కొడంగల్: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి వారిని ఆదుకునేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఇదివరకే వరి, మినుములకు కూడా ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించిందన్నారు. ప్రస్తుత సీజన్‌లో రాష్ట్రా వ్యాప్తంగా 95కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా వాటిలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 19కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కందికి రూ.5450 మద్దతు ధరగా ప్రభుత్వం ప్రకటించినట్లు వెల్లడించారు. దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునేందుకు జనవరి నుంచి 24గంటల నిరంతర కరెంటును సరఫరా చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. గతంలో కొందరు నాయకులు ఉచిత కరెంటు ఏలా ఇస్తారని, కరెంటు తీగలు బట్టలు అరెయ్యడానికే పనికి వస్తాయని చెప్పిన వారు ప్రస్తుతం ఏమి జవాబు చెబుతారని ప్రశ్నించారు. అలాగే రైతులకు ఆర్థిక సహకారం అందిచే లక్షంతో ఎకరాకు రూ.4వేల చొప్పున రెండు పంటలకు అందిస్తామని ప్రకటించారు. జిల్లాలోని పలు ప్రంతాల్లో ఏర్పాటు చేసిన కొత్త మార్కెట్లలో రైతులు ధాన్యాన్ని నిల్వచేసుకునేందుకు రూ.57కోట్లతో 47గిడ్డంగుల నిర్మాణం చేపట్టినట్లు మంత్రి తెలిపారు. రైతులు సరైన మద్దతు ధర లభించే వరకు ధాన్యాన్ని నిల్వచేసుకునేందుకు ఈ గిడ్డంగులు ఎంతో ఉపయోగపడతాయన్నారు. వెనుకబడిన కొడంగల్ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తాను కృత నిశ్చయంతో ఉన్నట్లు మంత్రి చెప్పారు. అభివృద్ధి కోసం కావాల్సిన నిధులను సమకురుస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి,ఎంపిపి దయాకర్‌రెడ్డి,జడ్పిటిసి సభ్యురాలు శరణమ్మ, ఆర్‌డిఒ వేణుగోపాల్ రావు,మార్క్‌ఫెడ్ డిఎమ్ జ్యోతి,సెక్రటరి చంద్రశేఖర్,సుపర్‌వైజర్ దేవదత్తు,తహసీల్దార్ వెంకటేష్,ఎంపిటిసి సభ్యులు ముద్దప్ప, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments