Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

బంగారు తెలంగాణనే ప్రభుత్వ ధ్యేయం

trs

మన తెలంగాణ/నిర్మల్‌టౌన్: బంగారు తెలంగాణ సాధించడమే ప్రభుత్వ లక్షమని పార్లమెంట్ సభ్యులు గెడం నగేష్ అన్నారు. మంగళవారం మండలంలోని పలు సంక్షేమ పథకాలు ప్రారంభించారు.  నాగాపూర్‌లోని కమ్యూనిటిహాల్, కొసగట్టు ఆశ్రమ పాఠశాల అదనపు గదుల ప్రారంభోత్సవం, రావికొత్తగూడంలో విద్యుత్‌లైన్, గంగపుత్ర సంఘానికి భూమి పూజ తదితర వాటిని ప్రారంభించారు. అనంతరం ఇటీవల పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు పర్వతాల లక్ష్మినారాయణ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఎంపి నగేష్, ఎమ్మెల్యే రేఖానాయక్‌లు  మాట్లాడుతూ కెసిఆర్ పాల నా సౌలభ్యం కోసం అధికారులే ప్రజల వద్దకు వెళ్తున్నారని, అలాగే రెసిడెన్సీ పాఠశాల 522 మంజూరు చేశామన్నారు. గత ప్రభుత్వాలు చేయలేని అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ ప్ర భుత్వం చేస్తుందని అన్నారు. అలాగే నాగాపూర్‌లోని చెరువు, మం దపెల్లిలో డ్యామ్,రోడ్డు సౌకర్యాలు తదితర సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకపోతామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శకుంతల భీమ్‌రావు, ఎంపిపి శోభారాణి, జెడ్పిటిసి సునీత, లలీల,సదాశివ్, ఎమ్మార్వో నూనే ప్రభాకర్, ఎపిఒ ప్రమిల, తక్కారం శ్రీనివాస్, రత్నకర్, వినోద్, పుప్పాల శంకర్, లచ్చవ్వ, రాజేందర్,ఆశ్వక్,సిఐ పెద్దన్న కుమార్,ఎస్‌ఐ సంజీవ్, అంజీబాబు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments