Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

సిరిసిల్లలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

 temple

గరుడవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు
మనతెలంగాణ/సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైన సిరిసిల్లలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారు గరుడ వాహనంపై ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని పెద్దసంఖ్యలో భక్తులు తెల్లవారు జామున నాలుగు గంటల నుంచే స్వా మివారి దర్శనానికి తరలివచ్చారు. తెల్లవారుజామున ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకుని భక్తులు పులకించిపోయారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఆ లయ పాలకవర్గం,సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు.ఆలయ ప్రాంగణమంతా విష్ణునామ స్మరణతో మారుమ్రోగిపోయింది. స్వామి వారిని పట్ట ణంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా పెద్దసంఖ్యలో దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇవ్వడం పూర్తి అయిన తరువాత స్వామివారిని గరుడ సేవపై తిరువీధి ఉత్సవం నిర్వహించారు.

Comments

comments