Search
Monday 19 March 2018
  • :
  • :
Latest News

రాష్ట్రానికి తలమానికంగా యాదాద్రి నిర్మాణం

nlg

* అపూర్వ శిల్ప సంపదతో క్షేత్ర నిర్మాణం
* స్వామి వారి దర్శనంలో మండలి చైర్మన్ స్వామి గౌడ్

 నాడు రాజులు ఆలయాల నిర్మాణా నికి చేసిన చరిత్ర విన్నామని కానీ నేడు తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయ పునఃనిర్మాణం యాదాద్రి క్షేత్రంగా నిలుస్తుందని శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ అన్నారు. శనివారం యాదా ద్రి క్షేత్రాన్ని సందర్శించిన ఆయనకు ఆలయ అర్చకులు ఉద్యోగులు, స్థానిక నా యకులు స్వాగతం పలికారు. అనంతరం బాలాలయంలోని శ్రీ లక్ష్మి నరసిం హుని దర్శించుకుని పూజలు నిర్వహించారు.  నాడు రాజులు ఆలయాల నిర్మాణానికి చేసిన చరిత్ర విన్నామని కానీ నేడు తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయ పునఃనిర్మాణం యాదాద్రి క్షేత్రంగా నిలుస్తుందని శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ అన్నారు. శనివారం యాదా ద్రి క్షేత్రాన్ని సందర్శించిన ఆయనకు ఆలయ అర్చకులు ఉద్యోగులు, స్థానిక నా యకులు స్వాగతం పలికారు. అనంతరం బాలాలయంలోని శ్రీ లక్ష్మి నరసిం హుని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకు లు ఆయనకు స్వామి వారి ఆశ్వీరచనం, తీర్ధప్రసాదాన్ని అందచేశారు. అనం తరం యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను పరిశీలన చేసి పనుల వివరాలను తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ పూర్వం శ్రీ కృష్ణ దేవరాయలు శిల్ప సంపదను ఆలయ నిర్మాణాలను చేపట్టారని తెలుసుకున్నామని నేడు తెలం గాణ ప్రభుత్వంలో యాదాద్రి క్షేత్రంలో జరుగుతున్న ఆలయ నిర్మాణ ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాతి చెందేలా జరుగుతున్న నిర్మాణంతో ముఖ్యమంత్రి కేసిఆర్ తరతరాలుగా చరి త్రలో నిలిచిపోతారని అన్నారు. స్వామి వారి దర్శనానికి నిత్యాతరలి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగ కుండా ఒకవైపు బాలాలయంలో దర్శనాలను కల్పిస్తూ మరోవైపు క్షేత్ర నిర్మాణం జరుగు తుండటం గొప్ప విశేషమని అన్నారు. ఈ ఆలయ నిర్మాణంలో పాలుపం చుకుంటునటువంటి శిల్పులకు, కార్మికులకు, దేవాలయ ఉద్యోగులకు, స్థానిక ప్రజలకు, భక్తులకు అభినందనలు తెలిపారు. అదే విధంగా ఈ క్షేత్రంలో విధు లు నిర్వహిస్తున్నటువంటి అర్చకులకు, ఉద్యోగులకు గ్రేటడ్ కమిటీ నిర్మాణం చేయాలని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హెల్త్ కార్డులు వర్తించేలా కృషి చేస్తామని జర్నలిస్టులకు నివాస స్థలాలను కేటాయింపు చేసేలా సిఎం దృష్ఠికి తీసుకుళ్తెమని తెలిపారు. ఆయన వెంట ఎంపిపి గడ్డమీది స్వప్న, సర్పంచ్ స్వామి, కసావు శ్రీనివాస్, గడ్డమీది రవీందర్, కర్రె వెంకటయ్య, పాల్గొన్నారు.
ఆలయ ఉద్యోగుల వినతి : శ్రీ లక్ష్మినరసింహ స్వామి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డ్ వర్తించాలని కో రుతూ శాసనమండలి చైర్మెన్ స్వామిగౌడ్‌కు ఆలయ ఉద్యోగులు వినతి పత్రాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ రమేష్, మేడి శివకుమార్, రామ్మో హన్, రఘు, భాస్కర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments