Search
Thursday 19 April 2018
  • :
  • :
Latest News

పొదల్లో పడేవేయబడ్డ పసిశిశువు

baby

-పీక్కతిన్న కుక్కలు,పందులు
-అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు

మనతెలంగాణ, వేములవాడ: పాపం ఓ పసిశిశువు పొదల్లో పడవేయడంతో కుక్కలు, పందులు పీక్క తిన్న సంఘటన పట్టణంలో చర్చనీయంశంగా మారింది. ఆదివారం రెండవ బైపాస్ బతుకమ్మ తెప్ప సమీపంలో ఖబరస్థాన్ ప్రదేశంలో దాదాపు 7రోజులకు చెందిన శిశువును ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు పడవేశారు. దీంతో ఆ శిశువును పందులు, కుక్కులు మెడభాగంలో పీక్కతిన్నాయి. ఈ సంఘటన తెలుసుకున్న పట్టణ సిఐ శ్రీనివాస్ సంఘటన స్థలీకి చేరుకొని పరిశీలించి మృతదేహాన్ని నగరపంచాయతీ సిబ్బంది సాయంతో ఖననం చేయించారు. కాగా పడవేయబడ్డ శిశువు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ మృతిచెందడంతో ఎవరో తీసుకవచ్చి ఈ ప్రాంతంలో పడవేసినట్లుగా తెలుస్తుందన్నారు. ఈ మేరకు అన్నికోణాల్లో దర్యాప్తుచేస్తామని ఆయన తెలిపారు.

Comments

comments