Search
Thursday 19 April 2018
  • :
  • :
Latest News

భూ తగాదాలతో వ్యక్తి దారుణహత్య

land

-రాయికల్ మండలం ఇటిక్యాలలో కిడ్నాప్ తుమ్మెనాలలో హత్య
-హత్య వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అనంతశర్మ
మనతెలంగాణ/ధర్మపురిః జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని తుమ్మెనాల శివారులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కోరుట్ల మండలం గుమ్లాపూర్‌కు చెందిన రాజ్‌మహ్మద్(52)గా పోలీసులు గుర్తించారు. గత వారం రోజుల క్రితం రాయికల్ మండలం ఇటిక్యాలలో రాజ్‌మహ్మద్‌ను కిడ్నాప్ చేసిన దుండగులు ధర్మపురి మండలంలోని తెమ్నెనాల శివారులోని అటవి ప్రాంతంలో హత్యచేసి పూడ్చిపెట్టారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న కోరుట్ల పోలీసులు రాజ్‌మహ్మద్ హత్యకు గురైనట్లు గుర్తించారు. మృతుని సొంత అన్నకుమారుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. హత్య జరిగిన ఘటన స్థలాన్ని జగిత్యాల ఎస్పీ అనంతశర్మ పరిశీలించి, ధర్మపురి తహసీల్దార్ సమక్షంలో రాజ్‌మహ్మద్ మృతదేహాన్ని తవ్వి తీసి అక్కడే పోస్టు మార్టం నిర్వహించి, మృతదేహాన్ని కుటుంబ సబ్యులకు అప్పగించారు.
భూతగాదాలే వల్లే హత్యః- జగిత్యాల ఎస్పీ అనంత్‌శర్మ
ధర్మపురి మండలం తుమ్మెనాల శివారులో జరిగిన హత్య భూ తగాదాల వల్లే జరిగిందని జగిత్యాల ఎస్పీ అనంతశర్మ తెలిపారు. తుమ్మెనాల అటవి ప్రాంతంలో జరిగిన ఘటన స్థలాన్ని ఆదివారం ఎస్పీ అనంతశర్మ పరిశీలించారు. అనంతరం హత్యకు సంబందించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కోరుట్ల మండలం గుమ్లాపూర్‌కు చెందిన రాజ్‌మహ్మద్ అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తు జీవనం కొనసాగిస్తున్నాడు. అతని సోదరులైన అబ్దుల్ రహీమ్, మహ్మద్ హుస్సేన్‌లు కోరుట్లలో స్థిరపడ్డారు. కోరుట్ల మండలం వెంకటాపూర్ స్టేజి వద్ద రాజ్ మహ్మద్ పేరున రూ. 30లక్షల విలువ చేసే 7గుంటల స్థలం ఉంది. అయితే రాజ్‌మహ్మద్ పేరున ఉన్న స్థలంలో తమకు వాట ఇవ్వాలని కోరుట్ల ఉంటున్న అబ్దుల్ రహీమ్ కుమారుడు అజోరోద్దీన్ పలు మార్లు రాజ్‌మహ్మద్‌ను అడగడం జరిగింది. ఈ విషయంలోనే అజారోద్దీన్ మరో నలుగురు వ్యక్తులతో కలిసి ఈ నెల 18 సాయంత్రం రాయికల్ మండలం ఇటిక్యాల శివారులో రాజ్‌మహ్మద్‌ను కిడ్నాప్ చేసి ధర్మపురి మండలంలోని తుమ్మెనాల శివారులోని అటవి ప్రాంతానికి కారులో తీసుకు వచ్చి, కత్తితో గొంతు కోసి హతమార్చి అక్కడే పూడ్చిపెట్టారు. అయితే రాజ్ మహ్మద్ కనిపించుడం లేదని ఆయన బార్య షరీఫా ఈ నెల 19 కోరుట్ల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అనుమానస్పదంగా తిరుగుతున్న అజారోద్దీన్‌ను కోరుట్ల బస్‌స్టాండ్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, మరో 4గురు వ్యక్తులతో కలిసి తానే హత్య చేసి పూడ్చిపెట్టినట్లు నిందుతుడు హాజారోద్దీన్ ఒప్పుకున్నాట్లు ఎస్పీ వివరించారు. ఈ కేసునే తక్కువ సమయంలో చేదించిన కోరుట్ల సిఐ రాజశేఖరరాజు, ఎస్‌ఐ రవి కుమార్‌లను ఎస్పీ అనంత శర్మ అభినందించారు. పరారిలో ఉన్న మిగిత 4నిందితులను కొద్ది రోజుల్లోనే పట్టుకుంటామన్నారు. ఆయన వెంట కోరుట్ల డిఎస్పీ నల్ల మల్లారెడ్డి, ధర్మపురి కోరుట్ల సిఐలు చెల్పూరి శ్రీనివాస్, రాజశేఖరరాజు, ఎస్‌ఐలు లక్ష్మినారాయణ, రవికుమార్, క్లూస్ టీమ్ తదితరులు ఉన్నారు.

Comments

comments