Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

అభివృద్ధిలో దేశంలోనే ఆదర్శం

kadiyam

*సాగుకు ఎకరానికి రూ.4వేల సాయం
*ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

మనతెలంగాణ/చెన్నరావుపేట: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మూడున్నరేళ్లలో రాష్ట్రంలోని ఏ రైతు కూడా ఎరువులు, విత్తనాలు, కరెంటు కోసం ఇబ్బందిపడలేదన్నారు. త్వరలో రైతులకు సాగు నిమిత్తం ఎకరానికి రూ.4వేలు అందించనున్నట్లు పేర్కొన్నారు.  శనివారం చెన్నారావుపేట మండలం ఎల్లయ్యగూడం గ్రామంలో శనివారం నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం మూ డున్నరేళ్లలో సాధించిన ప్రగతి, ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు రాష్ట్ర సివిల్ సప్లయి కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి పల్లె ప్రగతి కార్యక్రమా న్ని చేపట్టడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం నుం చి పెద్దఎత్తున నిధులు తీసుకొచ్చి నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజలు సమస్యలు తెలుసుకొని, వాటిని పరిష్కరించేందుకు ఆయన నిరంతరం కృషి చేస్తున్నార ని పేర్కొన్నారు. హరితహారం కార్యక్రమంలో నర్సంపే ట నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉందన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి రెండేళ్లలో నియోజకవర్గానికి రూ.20కోట్లు ప్రభుత్వం మంజూరుచేసిందని తెలిపారు. ఆయా నిర్మాణాలను మే నెలలోగా పూర్తి చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 5300 కోట్లు ఖర్చు చేస్తూ 40 లక్షల మందికి ఆసరా పెన్షన్స్ అందిస్తున్నామన్నా రు. అదేవిధంగా 16 వేల కోట్ల పంట రుణాలు చేశామన్నారు. ఈ నియోజకవర్గంలోని పాకాల, మదన్నపేట చెరువుల్లో, గ్రామాల్లోని అన్ని చెరువుల్లో కూడా ప్రభు త్వం అందించిన చేపల పిల్లలను పెద్ద ఎత్తున పెంచుతున్నట్లు తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా త్వరలో నర్సంపేట నియోజకవర్గం సస్యశ్యామలం కానుందని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలిపారు. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ప్రభుత్వం రూ.75,116 అందిస్తోందని తెలిపారు. గర్భిణీలకు ప్రభుత్వం తరపున రూ.12 వేలు అందిస్తున్నామని, కెసిఆర్ కిట్ అందిస్తున్నామని వివరించా రు. ఆడపిల్లలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపడుతూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రథమస్థానంలో నిలుస్తుందని పేర్కొన్నా రు. ఈ సందర్బంగా ఎల్లయ్యగూడెంతో ఉన్న తనకున్న అనుబంధాన్ని ఉపముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు.
ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం : ఎంపి సీతారాంనాయక్
మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు ప్రొఫెసర్ సీతారాంనాయక్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఎస్సి, ఎస్టి, బిసి మైనార్టిల పిల్లల విద్యాభివృద్ధికి ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రంలో 50 గురుకులాలు, 21 డిగ్రీ కళాశాలలు మంజూరి చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని ఆయనన్నారు. ఇందుకు ఏడాది లక్షా 21 వేలు ఒక్కో విద్యార్థి ప్రభుత్వం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వమన్నారు. ప్రజల సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం ఉందని తెలిపారు. మూడున్నరేళ్లలో నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి ఎంపిగా నిధులు మంజూరి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎంపి ల్యాండ్స్ నిధుల నుంచి రూ.15 లక్షలు కేటాయించినట్లు తెలిపారు.
10వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాం : పెద్ది సుదర్శన్‌రెడ్డి
కుటీర పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష నుంచి 25 లక్షల వరకు 35 శాతం సబ్సిడి అందిస్తోందని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. గ్రామాల్లో ఉన్న రైతులు, మహిళలు, యువకులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. మహిళలు, యువతులు ప్రభుత్వం అం దిస్తున్న సబ్సిడిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కుటీర పరిశ్రమల ఏర్పాటులో భాగంగా కారం, పసుపు ప్యాకెట్లను తయారు చేసుకోవచ్చని తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా నర్సంపేట నియోజకవర్గంలోని దాదాపు 10 వేల మందికి కుటీర పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పిస్తున్నామన్నారు. ప్రతి గ్రామంలో ఒక కుటీరపరిశ్రమను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఔత్సాహికులు అధికంగా ఉన్న గ్రామాల్లో రెండో కుటీర పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉం దని పేర్కొన్నారు.

Comments

comments