Search
Sunday 20 May 2018
  • :
  • :
Latest News

ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడమే లక్ష్యం

bumfut

చెల్లని రూపాయి ఎవరో త్వరలోనే తెలుస్తుంది
దమ్ముంటే రాజీనామాను ఆమోదించుకోవాలి
పార్టీ మారినవారు గొర్ల్రైతే మరి నీవేమిటి
రవాణాశాఖా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి

మనతెలంగాణ/దౌల్తాబాద్: జిల్లా మంత్రిగా కోడంగల్,దౌల్తాబాద్, బొంరాస్‌పేట్ మండలాల ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ ప్రబుత్వ పథకాలను ప్రజలకు అందించడమే తమ లక్షం అని రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రోజు మండలంలోని పలు గ్రామాలలో మిషన్ భగీరథ పథకంలో బాగంగా నిర్మించ తలపెట్టిన ట్యాంకుల నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమాలను నిర్వహించారు. మండల పరిదిలోని నీటూరు గ్రామంలో 1౦౦ కేఎల్ ట్యాంకు నిర్మాణానికి 24.14 లక్షలు, నర్సాపూర్ గ్రామంలో 2౦ కేఎల్ ట్యాంకు నిర్మాణానికి 1౦.85 లక్షలు,దౌల్తాబాద్‌లో 1౦౦ కేఎల్ ట్యాంకు నిర్మాణానికి 24.1౦ లక్షలు. ఈర్లపల్లి లో 6౦ కేఎల్ ట్యాంకు నిర్మాణానికి 18.16 లక్షలు, చెల్లాపూర్‌లో 8౦ కేఎల్ ట్యాంకు నిర్మాణానికి 21.33 లక్షలు, తిమ్మారెడ్డిపల్లిలో 1౦౦ కేఎల్ ట్యాంకు నిర్మాణానికి 24.14 లక్షలు ,బాలంపేట్‌లో 1౦౦ కేఎల్ ట్యాంకు నిర్మాణానికి 24.1౦ లక్షలు, బిచ్చాల్ లో 7౦ కేఎల్ ట్యాంకు నిర్మాణానికి 19.8౦ లక్షలు, కుప్పగిరి గ్రామంలో 3౦ కేఎల్ ట్యాంకు నిర్మాణానికి 14.75 లక్షల రూపాయలతో మంజూరయిన ట్యాంకుల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన కార్యక్రమాలను నిర్వహించారు. దాంతో పాటు మండల కేంద్రంలో 7.39 కోట్లతో నిర్మించతలపెట్టిన మినీట్యాంక్‌బండ్ నిర్మాణానికి మంత్రి శంకు స్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి ప్రబుత్వం కట్టుబడి ఉందన్నారు. పాత మహాబూబ్‌నగర్ జిల్లా నుండి వేరుపడి నూతనంగా ఏర్పాటు చేసిన వికారాబాద్ జిల్లాలో చేర్చిన మూడు మండలాల అబివృద్దికి జిల్లా మంత్రిగా తాను కట్టుబడి ఉన్నానన్నారు. ప్రబుత్వం ప్రతిష్టాత్మకమైన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, రుణమాఫీ, ఇరవైనాలుగు గంటల ఉచిత విద్యుత్తు, ఆసరా పించన్లు తదితర ప్రజాకర్షక పథకాలను అమలు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రబుత్వం అమలు పరుస్తున్న అబివృద్ది పథకాలను దేశంలోని రాష్ట్రాలన్ని అబినందిస్తున్న విషయాన్ని ప్రతి పక్ష పార్టీలు జీర్ణించుకోలేక పోతున్నాయన్నారు. అలాగే రైతు శ్రేయస్సే ప్రదానంగా పని చేస్తున్న తమ ప్రబుత్వం రైతులకు త్వరలోనే పంటల పెట్టుబడి పథకం కింద ఎకరాకు 4౦౦౦ రూపాయలను నేరుగా రైతు ఖాతాలలో జమ చేయడానికి వీలుగా భూ సమగ్ర సర్వేను నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలోనే సర్వే పూర్తయి రైతులకు డబ్బులను ఖాతాలలో జమచేసి రాష్ట్రంలో రైతును రాజుగా చేస్తామన్నారు.
దమ్ముంటే రేవంత్‌రెడ్డి
రాజీనామాను ఆమోదింపజేసుకోవాలి
టీడీపీ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రేస్ పార్టీలో చేరిన స్థానిక ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి దమ్ముంటే రాజీనామాను స్పీకర్ పార్మాట్‌లో ఆమోదింపజేసుకోవాలని మంత్రి మహేందర్‌రెడ్డి సవాలు విసిరారు. గత రెండు పర్యాయాలు కోడంగల్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ఈ ప్రాంత అబివృద్దిని పూర్తిగా విస్మరించారన్నారు. కోడంగల్ ఎమ్మెల్యేనని పేరు చెప్పుకొని హైద్రాబాద్‌లో తన సొంత ఆస్తులను కూడబెట్టుకొన్నారని ఆయన విమర్శించారు. తాను మంత్రిగా మండలంలోని గ్రామాలలో తిరుగుతున్నానన్న మంత్రి ఎమ్మెల్యేగా గెలుపొందిన తరువాత రేవంత్‌రెడ్డి అసలు నియోజకవర్గంలోని గ్రామాలలో తిరుగలేదన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. చెల్లని రూపాయి అని ఇతరులను ఎద్దేవా చేస్తున్న రేవంత్‌కి ఎవరు చెల్లని రూపాయో త్వరలోనే తెలుస్తుందన్నారు. నియోజకవర్గంలో తేరాసా పార్టీలోకి వచ్చిన నాయకులందరిని గొర్రెలతో పోలుస్తున్న రేవంత్‌రెడ్డి తేదేపా నుండి కాంగ్రేస్ పార్టీలోకి మారిన తనను ఏమనాలో తెలియజేయాలన్నారు. ఓటమి భయంతోనే రాజీనామాను రేవంత్‌రెడ్డి ఆమోదింప జేసుకోలేకపోతున్నాడన్న మంత్రి కోడంగల్‌లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీఆర్‌యస్ బారీ మెజారిటీతో గెలుస్తుందన్న దీమాను వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డిని ఓడించడానికి తాను అవసరం లేదన్న మంత్రి తేదేపా నుండి తేరాసా లోకి వచ్చిన వారే ఆయనను ఓడించడానికి సరిపోతారన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు అంజిలమ్మ, పార్వతమ్మ, విజయ్‌కుమార్, భీమమ్మ, సత్యమ్మ,జడ్‌పీటీసీ సభ్యురాలు వెంకటమ్మ, ఎంపీపీ నర్సింగ్‌బాన్‌సింగ్, నాయకులు ముద్దప్పదేశ్‌ముఖ్, మోహన్‌రెడ్డి, ప్రమోద్‌రావు, రాంరెడ్డి, మహిపాల్‌రెడ్డి, నర్వోత్తంరెడ్డి, శాణప్ప, భీములు, మైనోద్దీన్, భగవంతు,మల్లేశం, బానుప్రకాష్, ఆయా శాఖల ఉన్నతాదికారులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments