Search
Sunday 21 January 2018
  • :
  • :

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన పార్టీ కాంగ్రెస్

cong

మనతెలంగాణ/దుబ్బాక : దేశంలోనే అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించి ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిపిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అనంతుల శ్రీనివాస్ పేర్కోన్నారు. గురువారం దుబ్బాక మండల కేంద్రంలో పార్టీ ఆవిర్భవ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ వద్ద పార్టీ జెండాను ఎగురవేసి, ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. కాంగ్రెస్ హయంలోనే అట్టడుగు ప్రజల అభ్యున్నతికి పాటుపడిందని గుర్తు చేశారు. నాటి ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది కూడ కాంగ్రెస్ పార్టేనని అన్నారు. అంతటి ఘన చరిత్ర కలిగిన పార్టీ మళ్లి అధికారంలోకి వస్తేనే తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ఆ దిశగా పార్టీకి పూర్వ వైభవం తెచ్చేలా కార్యకర్తలందరు కృషి చేస్తున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రంలో నాయకులు గడీల జనార్ధన్‌రెడ్డి, రాజిరెడ్డి, అనంతుల రాజు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments