Search
Wednesday 24 January 2018
  • :
  • :
Latest News

అదుపుతప్పి పడిపోయిన విహార యాత్ర బస్సు

bus
– గాయాలపాలైన చిన్నారి 
– విద్యార్థులను ఆస్పత్రికి తరలించి పరామర్శిస్తున్న ఎస్సై 
– విషన్నవదనంలో విద్యార్థులు 
– ఏడుగురు విద్యార్థులతు స్వల్ప గాయాలు

మన తెలంగాణ/చర్ల ః తాలిపేరు ప్రాజెక్టు వద్దకు ఆదివారం విహార యాత్రకు స్కూల్ విద్యార్థుల బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలు అయ్యాయి. వివరాల ప్రకారం బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన శ్రీనివాసవిద్యానికేతన్ పాఠశాలకు చెందిన సుమారు 40 మంది విద్యార్థులు తాలిపేరుప్రాజెక్టు వద్దకు విహారయాత్రకు వచ్చారు. యాత్ర ముగించుకుని తిరిగి ప్రయాణం అవుతుండగా ప్రాజెక్టు సమీపంలో ఎత్తు ఎక్కలేక బస్సు ఒక్క సారిగా అదుపుతప్పింది. బస్సు ప్రక్కకు పడిపోవడంతో విద్యార్థులకు గాయాలు అయ్యాయి. దీనితో పెను ప్రమాదం తప్పినట్లు అయింది. విద్యార్థులు ఎవరికీ తీవ్ర గాయాలు కాకపోవడంతో పాఠశాలయాజమన్యాం ఊపిరి పీల్చుకుంది. సంఘటన స్థలంలో చర్ల ఎస్సై సత్యనారాయణ తన సిబ్బందితో ఉండటంతో ఆయన విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయాలపాలైన వారిలో తేజావత్ నందిని, కమ్మ ఉషశ్రీ తన్నీరు కార్తీక్, పాండవుల శ్రావ్య, గడ్డం అనూష, కమ్మ ఉదయ శ్రీ, వల్లేటి మహాలక్ష్మీ, బోయిన గీత ఉన్నారు. విద్యార్థులు అందర్నీ చర్ల రాహుల్ విజ్ఞాన్ విద్యాలయానికి చెందిన బస్సులో లక్ష్మీపురం తరలించారు.

Comments

comments