Search
Sunday 27 May 2018
  • :
  • :

మహ్మద్ ప్రవక్త సూక్తులను పాటించాలి

mohd

మన తెలంగాణ/కామారెడ్డి: మహ్మద్ ప్రవక్త ప్రవచించిన సూక్తులను సందేశాలను అందరు పాటించాలని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. శనివారం మహ్మద్ ప్రవక్త జయంతి మిలాద్ ఉన్ నబీ పండుగను తెలంగాణ మైనారిటీ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పండ్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఫ్యామిలీ ప్లానింగ్ వార్డులో, ప్రసైతి వార్డులో పండ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మిలాద్ ఉన్ నబీ పండుగ శుభా కాంక్షలు తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్ర మాలు ఏర్పాటు చేయడం అభినందనీయమ న్నారు. మహ్మద్ ప్రవక్త సూక్తులు సందేశాలను పాటించి అందరూ సోదర భావంతో మెల గాలని మంచి సమాజ స్థాపనకు కృషి చేయాల న్నారు. అలాగే పేషెంట్లను కలిసి వారి పరిస్థి తులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభు త్వం అందజేస్తున్న కెసిఆర్ కిట్స్ మాతా శిశు సంరక్షణ పథకాల గురించి ఆయన తెలియ జేశారు. అనంతరం ఆసుపత్రిలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. రూ. 31 లక్షలతో నిర్మిస్తున్న ఆదనపు 30 పడకల గదులు ఈ నెల 25 తేదీలోగా పూర్తి చేయాలని 7 లక్షలతో పెయింటింగ్ రూమ్, షెడ్ నిర్మాణం  ఈ నెల 15లోపు పూర్తి చేయాలని, 17 లక్షలతో కలెక్టర్ కృషియల్ బ్యా లెన్స్ నుండా వాటర్ సప్లై ,డ్రైనేజీ పనుల నిర్మాణం ఈ నెల 20 లొగా పూర్తి చేయాలని సంబంధిత పంచాయతీ రాజ్, ఆర్‌డబ్లుఎస్ అధికా రులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి కో ఆర్డినేటర్ డాక్టర్ అజయ్‌కుమార్, తెలంగాణ మైనారిటీ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియే షన్ ప్రెసిడెంట్ ఎంఏ బషీర్, జనరల్ సెక్రెటరీ గఫూర్ శిక్షక్, డాక్టర్ శ్రీనివాస్, ఖదీర్, షకీల్, హజ్మత్, నిజాముద్దీన్‌లు పాల్గొన్నారు.

Comments

comments