Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

ప్రజాస్వామ్యంలో పాత్రికేయుల పాత్ర కీలకం

posterమన తెలంగాణ/తాండూరు : ప్రజా స్వామ్యంలో పాత్రీకేయుల పాత్ర ముఖ్యమైందని బీజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్‌ఆర్‌ఐ పటేల్ రవిశంకర్ అన్నారు.శుక్రవారం పట్ఠణంలోని బీజేపి పార్టీ కార్యాలయంలో మన తెలంగాణ 2018 క్యాలెండర్‌ను అవిష్కరించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ప్రజాస్వామ్యంలో పాత్రీకేయులు కీలక పాత్ర పోషించాలని ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నారని అన్నారు.దేశంలో పత్రిక స్వేచ్చను హారిస్తున్న తరుణంలో దేశ ప్రధాని మోడి పత్రిక స్వేచ్చకు భంగం కలుగకుండా చూస్తున్నారని అన్నారు.మన తెలంగాణ ఆవిర్బావం నుండి ప్రజల పక్షాన నిలబడి నిజాలను నిర్బయంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తుందని అన్నారు.జర్నలిస్టుల సంక్షేమానికి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.అనంతరం బీజేపి కార్యకర్తలతో కలిసి మన తెలంగాణ 2018 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో బీజేపి నాయకులు గాజుల శాంతుకుమార్,జయశ్రీ రవిశంకర్,పూజారి పాండు,బంట్వారం భద్రేశ్వర్,కృష్ణ ముదిరాజ్,పటేల్ విజయకుమార్ బీజేపి కార్యకర్తలు పాల్గోన్నారు.

Comments

comments