Search
Thursday 18 January 2018
  • :
  • :
Latest News

పేదలకు పథకాలు అందేలా కృషి

talk

మన తెలంగాణ/భూపాలపల్లి ప్రతినిథి: ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అందించి పేదల అభ్యున్నతికి అధికారులు కృషిచేయాలని భారత ప్రభుత్వ గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖల సంయుక్త కార్యదర్శి సంజయ్‌కుమార్ జిల్లా అధికారులను సూచించారు. దేశం లో గుర్తించిన 115అత్యంత వెనుకబడిన జిల్లా లు వెనుకబడి ఉండడానికి గల కారణాలను తెలుసుకొని వాటి పరిష్కారానికి మార్గాలు కనుగునేందుకు కేంద్రప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. అందులో భాగంగా జయశంకరర్ భూపాలపల్లి జిల్లాను అత్యంత వెనుకబడిన జిల్లా గా గుర్తించి ప్రత్యేక అధికారిగా సంజయ్‌కుమార్‌ను నియమించింది. అందులో భాగంగా సంజయ్‌కుమార్ శుక్రవారం జిల్లాకు వచ్చి కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మురళితోపాటు జిల్లా ఉన్నతాధికారులతో సమావేశమై పేదరిక నిర్మూలనకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చేపట్టిన పథకాల అమలును పరిశీలించారు. ఈ సందర్భంగా సంజీయ్‌కుమార్ సమగ్ర కుటుంబసర్వే ద్వారా జిల్లాలో నమోదైన కుటుంబాల వివరాలు ఆర్థిక పరిస్థితిని పరిశీలించారు. జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమం జిల్లాలో అమలుకాకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలో కల్పిస్తున్న సౌకర్యాలు, అం దుతున్న వైద్యసేవలపై విద్యాసౌకర్యాలు మోడల్ ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు పక్రి య రైతులకు అందుతున్న సౌకర్యాలు యువతకు వృత్తి నైపుణ్యశిక్షణ అంశాలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలకు విద్యా, వైద్యా ఉపాధి సౌకర్యాలు సమర్థవంతంగా అందినపుడు ప్రజలు పేదరికం నుంచి అభివృద్ధిలోకి వస్తారని, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసంక్షేమ పథకాలను ప్రజల్లోకి అధికారులు సమర్థవంతంగా తీసుకెల్లగలిగితే పేదల జీవితాల్లో వెలుగు సాధ్యమవుతుందన్నారు. ఎస్‌ఆర్‌ఎచ్‌వో, ఎస్‌ఎచ్‌వో పథకాలు రాష్ట్రప్రభుత్వం నిధులతో ప్రభుత్వం ఆసుపత్రులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పేదరిక నిర్మూలనకు జిల్లా అధికార యంత్రాంగం కృషిచేస్తుందని, ఒకటి రెండు మినహా ప్రసవాలు అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్నాయని గ్రామాలను ప్రభుత్వ అధికారులు దత్తత తీసుకొని మౌళి క సౌకర్యాల కల్పనకుకృషి జరుగుతుందని నిరుపేద విద్యార్థులకు ఉచిత న్యాయమైన ఆంగ్ల విద్య ను అందించేందుకు మోడల్ ఇంగ్లీష్ మీడియం కోసం సన్నాహాలకు జరుగుతున్నాయని ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం మిషన్ భగీరథ వేగంగా జరుగుతున్నాయని కలెక్టర్ మురళి సంజయ్‌కుమారుకు వివరించారు. జిల్లా సంయుక్త కలెక్టర్ అమైకుమా ర్, ఐసిడిఎ పివో చక్రధర్‌రావు, డీఆర్వో మోహన్‌లాల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments

comments