Search
Monday 11 December 2017
  • :
  • :

తెలుగు భాష తియ్యదనం గొప్పది

stage

*ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం గర్వకారణం
*రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి
*తెలుగు భాషనుంచి సంప్రదాయం, సంస్కృతి నేర్చుకోవచ్చు

మన తెలంగాణ/ వికారాబాద్ టౌన్ :  దేశంలో ఎన్ని కులాలు ఉన్నా ఎన్ని భాషలు ఉన్నా తెలుగు భాష తియ్యదనం గొప్పదని  రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక అంబేద్కర్ భవనంలో ప్రభుత్వం తరపున నిర్వహిస్తున్న జిల్లా స్థాయి తెలుగు భాషా వారోత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ దివ్య తో కలిసి జిల్లా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ముఖ్యమంత్రి   ఈ నెల 15 నుండి 19 వరకు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం గర్వకారణమని అన్నారు. అందులో భాగంగా అన్ని 

జిల్లాలో 2నుండి 8 వరకు జిల్లాస్థాయి వారోత్సవాలు గొప్పగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, తెలుగు భాష గొప్పదనంపై వివరించడం తదితర కార్యక్రమాలు సంతోషంగా జరుపు కోవాలని అన్నారు. దేశంతో పాటు ప్రపంచ స్థాయిలో తెలుగు వారందరు తెలుగు భాష వారోత్సవాలు జరుపుకుంటున్నారని అన్నారు. ఎన్ని భాషలు నేర్చుకున్నా తెలుగు భాషను మర్చి పోకూడదని సూచించారు. జిల్లా కలెక్టర్ దివ్యాదేవరాజన్ మాట్లాడుతూ తెలుగు భాషనుంచి సంస్కృతి, సంప్రదాలు నేర్చుకోవచ్చని అన్నారు. ఏ భాషలో లేనటువంటి కుటుంబ సంబందాల పిలుపులు సంభోదించటం తెలుగు భాషలో ఉన్నాయని అన్నారు. అదేవిధంగా పరిపాలన కూడ సామాన్యప్రజలు మాట్లాడే తెలుగు భాషలో ఉంటే వారికి మరింత చేరువ కావోచ్చని అన్నారు. దేశంలో బ్రిటీష్ వారు మనల్ని కాలనీలుగా కన్వర్టు చేసి వారి ఇంగ్లీష్ భాషను మనపై ఫోర్సు చేశారని అన్నారు. ఇంగ్లీష్ భాషతో పాటు తెలుగు మాట్లాడటం మర్చి పోకూడదని అన్నారు. అదేవిదంగా ప్రధాన వక్త సాంబశివ శర్మ మాట్లాడూతూ తెలుగు భాష వికాసం తెలంగాణలోనే జరిగిందని దానికి ఆధారాలు ఉన్నాయని అన్నారు. ఉమ్మడి పాలనలో మన తెలుగు కవులు మరుగునపడి పోయారని అన్నారు. జెసి సంద్యారాణి ,చెవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రసంగించారు. అంతకు ముందు కళాకారులు, విద్యార్థులు. అధికారులతో కలిసి తెలుగు వారోత్సవాలను పురస్కరించుకొని వికారాబాద్‌లో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు, కళాకారులు చేసిన సాంస్కతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. అనంతరం మంత్రి చేతుల మీదుగా తెలుగు కవులను, పండితులను శాలువాలు కప్పి మెమోంటోలతో సత్కరించారు. అనంతరం కళాకారులతో యక్షగానం నాటికను ప్రదర్శించారు.

కార్యక్రమంలో ఎంపిపి భాగ్యలక్ష్మీ, జడ్‌పిటిసి ముత్తార్‌షరీఫ్, నవాపేట ఎంపిపి పాండురంగారెడ్డి,, పోలీస్ రాంరెడ్డి, జిల్లా బిసి సంక్షేమశాఖ అధికారి పుష్పలతారెడ్డి వికారాబాద్ డిఎస్పీ శిరీష, ఎంపిడిఓ సత్తయ్య, ధారూర్ పిఎసిఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, తెలుగు కవులు,వీరకాంతం, వివిధ పాఠశాలల, కళాశాలల విద్యార్థులు పాల్గోన్నారు.

Comments

comments