Search
Sunday 20 May 2018
  • :
  • :
Latest News

విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే

mam

మన తెలంగాణ/జనగామ ప్రతినిథి: విద్యార్థులల్లోని సృజనాత్మతను వెలికితీసి వారికి బంగారు భవిష్యత్తునిచ్చే దిశగా ఉపాధ్యాయులు కీలకపాత్ర వహించాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జి.పద్మ అన్నారు. బుధవారం ఉదయం జనగామ పట్టణంలోని సాంఘీక సంక్షేమ గురుకలు విద్యాలయం లో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో రెండురోజు ల పాటు నిర్వహించనున్న జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన – 2017 ప్రారంభ కార్యక్రమానికి చైర్‌పర్సన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. విద్యార్థులు భారత మాజీ రాష్ట్రపతి అబ్ధుల్ కలాం సూచించినట్లు కలలు కని వాటిని సాధించేందుకు ప్రయత్నించాలని, తద్వారా గ్రామానికి, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. రాష్ట్రప్రభుత్వం అందరికీ విద్యనందించే విషయం లో ఇప్పటికి 520గురుకుల పాఠశాలలు మంజూ రు చేసిందన్నారు. ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనల ద్వారా విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి వారిని తీర్చిదిద్దాలని ఉపాద్యాయులను కోరారు. జిల్లాలో ఈసారి 10వ తరగతి ఉత్తీర్ణతలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని కోరారు. శాసనమండలి సభ్యులు పూల రవీందర్ మాట్లాడుతూ బాల శాస్త్రవేత్తలను గుర్తించేందుకు ఇలాం టి ప్రదర్శనలు ఎంతగానో దోహదపడుతాయిన అన్నారు. నూతనంగా ఆవిష్కరించే ప్రదర్శనలు సమాజ హితానికి తోడ్పడాలని, విద్యార్థులకు డిజిటల్ తరగతుల నిర్వాహణ ద్వారా వారికి సులువుగా అర్థమయ్యే రీతిలో భోధించవచ్చని అన్నారు. స్టేషన్‌ఘనపురం ఎంఎల్‌ఎ టి రాజయ్య మాట్లాడుతూ దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే ఉందని, తరగతి గదిలో ఉన్న విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చి దిద్దే విధంగా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. తాను పశువుల కాపరి నుండి పిల్లల దాక్టరుగా మారడంలో తన ఉపాధ్యాయుల కృషి ఎంతగానో దోహద పడిందని అన్నారు. ఇలాంటి ప్రదర్శనల ద్వారా సమాజంలో మూడ నమ్మకాలు తొలగేందుకు, పరిసరాల పరిశుభ్రతకు దోహదపడుతాయని అన్నారు. జిల్లా కలెక్టర్ ఎ శ్రీదేవసేన మాట్లాడుతూ మానవ శరీరం అన్ని ప్రాణుల కన్నా చాల గొప్పదని, శరీరాన్ని, మనస్సును, ఆలోచనలను సమన్వయపరిస్తే అద్భుతాలు సృష్టించవచ్చునన్నారు. ఈ సందర్భంగా ఆర్ట్ టీచర్ వేణుమాధవ్ పిల్లన గ్రోవుతో (మురళి) చక్క గా సినిగీతం వినిపించగా దానికి ముగ్ధులైన కలెక్టర్ వేధికపై వేణుమాధవ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలు పలువురిని ఎంతో ఆకట్టుకున్నాయి.

Comments

comments