Search
Wednesday 24 January 2018
  • :
  • :
Latest News

టిఆర్‌ఎస్ ప్రభుత్వానిది పని తక్కువ ప్రచారం ఎక్కువ

cong

* డబుల్ పథకం దగుల్‌బాజీ పథకం
* ఎంఎల్‌సి కూచకుళ్ళ దామోదర్ రెడ్డి

మనతెలంగాణ/బిజినేపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిన ప్రాజెక్టుల కు తుది మెరుగులు దిద్ది స్వీచ్ ఆన్‌చేసి కాల్వల వెంట నీరు పారించిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం తామే మొత్తం పనిచేసినట్లు ఆర్భాటాలు చేస్తున్నద ని ఎమ్మెల్సి కూచకుళ్ళ దామోదర్‌రెడ్డి విమర్షించారు. ఆదివారం మండ ల కేంద్రంలోని ఎంజెఆర్ పంక్షన్ హాల్‌లో మండల స్దాయి కార్యకర్తల విస్తృత స్దాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయిన ఆయన ప్రసంగిస్తూ ప్రతి గ్రామాలలో కార్యకర్తలు పటిష్టంగా తయారయి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. మూడున్నర సంవత్సరాల కెసిఆర్ పాలనలో ప్రజలు విసిగిపోయారని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామిని కూడా నెరవేర్చలేక పోయారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2లక్షల రుణ మాఫీతో పాటు 5లక్షలు ఇందిరమ్మ ఇళ్లుకు ఇవ్వనున్నట్లు పేర్కొ న్నారు. అదేవిధంగా నిరుద్యోగుల భృతి క్రింద డిగ్రీ పూర్తి చేసిన ప్రతివ్య క్తికి జీవన భృతి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని , టిఆర్‌ఎస్ ప్రభుత్వం లా గా పూటకో మా ట చెప్పే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు. అదేవిధంగా నియో జకవర్గాన్ని అన్నిరకాలుగా అభివృద్ది పరుస్తున్నానని చెపుతున్న ఎమ్మెల్యే  మర్రి ఎం అభివృత్ది చేసారో చూపించాలన్నారు. మర్రి మాయ మాటలు నమ్మి మోసపోయే పరిస్తితిలో నియోజకవర్గ ప్రజలు లేరని , మర్రిని మా యం చేసి కాంగ్రెస్ పట్టం కట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం వివిద గ్రామాల నుండి వచ్చిన 100మంది ఇతర పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. సమావేశంలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ , రాజేష్ రెడ్డి  జడ్పీటిసి కొండామ ణెమ్మ, ఎంపిపి బండిశాంతమ్మ ,జడ్పీటిసి సుధాపరిమళ , సర్పంచ్ తిరపతయ్య , బాల్‌రాజు గౌడ్, అమృత్ రెడ్డి ,శేఖర్ రెడ్డ పాల్గొన్నారు.

Comments

comments