Search
Sunday 25 February 2018
  • :
  • :

గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

suicide
మనతెలంగాణ/కొణిజర్ల : గుర్తుతెలియని వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం మండల పరిదిలోని తనికెళ్ల సమీపంలో రాష్ట్రీయ రహదారి ప్రక్కన గురువారం చోటు చేసుకుంది,. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం సుమారు (45) వయస్సు గల వ్యక్తి ఖమ్మం నగరం లేక చుట్టుప్రక్కల పరిసర ప్రాంతానికి చెందిన ముస్లిం వ్యక్తి అయిఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు బ్లాక్ కలర్ ప్యాంటు, నీలం కలర్ షర్ట్ ధరించి ఉన్నాడు. మృతుడు ఉదయం సుమారు 5 గంటల సమయంలో ఖమ్మం నుంచి పల్లిపాడుకు ప్రయాణించేందుకు ఆర్టీసి బస్సు టిక్కెట్ కలిగి ఉన్నాడు. ఉదయం పొలంపనులకు వెళ్లేవారు చెట్టుకు వ్యక్తి ఉరేసుకున్న సంఘటన చూసి పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఏఎస్సై జగన్‌మోహన్‌రెడ్డి తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కేసునమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
హత్యా.. ఆత్మహత్యా
ఉరేసుకున్న వ్యక్తి ఉరికి ప్లాస్టిక్ తాడు ఉపయోగించాడు. ఉరేసుకున్న వ్యక్తి మెడకి పూర్తిగా ఉచ్చు బిగించుకోలేదు. వ్యక్తి ఉరేసుకున్న సంఘటనా స్థలం సమీపానికి కొద్ది దూరంలో మరో చెట్టు కింద రెండు తాగిన మద్యం బాటిళ్లు , నాలుగు ఖాళీ వాటర్ బాటిళ్లు , వార్తా పత్రిక , సెల్‌ఫోన్‌లోని సిమ్ కార్డు విరిచివేయబడి ఉండటంతో పాటు సెల్ ఫోన్‌లోని బ్యాటరీ కన్పించకుండా పోయింది. ఆర్టీసి బస్సులో ఖమ్మం నుంచి పల్లిపాడు వరకు ప్రయాణించేందుకు తీసుకున్న బస్సుటికెట్ ఉండటంతో అక్కడు వచ్చిన ప్రజలు ఇది హత్యా లేక ఆత్మహత్యా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చెట్టుకు కట్టిన ప్లాస్టిక్ తాడు చెట్టు పై బాడవకు కట్టి ఉండటంతో పాటు దట్టమైన మండలలోనుంచి ఉరేసుకున్న వ్యక్తి కిందకు వేలాడుతు ఉండటంతో దట్టమైన ఇరుకు మండలలోనుంచి వ్యక్తి కిందకు ఎలా దూకే అవకాశం ఉంటుందని అక్కడకు వచ్చిన వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడే చెట్టుకు ఉరేసుకొని ఉండవచ్చా? ఇంకెవరైనా చంపి చెట్టుకు వేలాడదీశారా ? అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఈ కేసును పోలీసులు సమగ్రంగా విచారణ జరిపితే అసలు దోషులు పట్టుపడే అవకాశం ఉంది. తూతూమంత్రంగా విచారణ జరిపి కేసు మూసి వేస్తే అసలు దోషులు బయటపడే అవకాశం ఉంది. దీంతో పోలీసులు సమగ్ర విచారణ జరిపి అసలు నేరస్తులను పట్టుకుంటారో ? కేసు మమ అనిపించి చేతులు దులుపుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

Comments

comments