Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

వలసల నిషేధం ఒకె

ట్రంప్ ట్రావెల్ బ్యాన్ ఉత్తర్వులకు అమెరికా సు్రప్రీంకోర్టు పచ్చజెండా
ఇరాన్, సిరియా, లిబియా, యెమెన్, సోమాలియా, చాద్‌ల నుంచి వలసల నిషేధంపై కింది కోర్టుల అడ్డంకుల తొలగింపు

US-Court

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకువచ్చిన ట్రావెల్ బ్యాన్ ఉత్తర్వులను అమెరికా సుప్రీంకోర్టు సమర్థించిం ది. ఆరు ముస్లిం ప్రాబల్య దేశాల నుంచి వలసలను ఆపేందుకు ట్రంప్ ఈ చట్టం తలపెట్టారు. దీనిని తక్షణం ఎలాంటి ఆటంకాలు లేకుండా అమలులోకి తీసుకురావచ్చునని సుప్రీంకోర్టు మంగళవారం తెలిపింది. ఈ రాకపోకల ఆంక్షలను నిలిపివేయాలనే అభ్యర్థనను న్యాయస్థానం పెండింగ్‌లో పెట్టింది. జనవరిలో అధికారంలోకి వచ్చిన తరువాత ట్రంప్ తీసుకున్న మూడో వివాదాస్పద నిర్ణయంగా ఈ ట్రావెల్ బ్యాన్ చట్టం నిలిచింది. ఇది సమర్థనీయమేనని సుప్రీంకోర్టు పేర్కొనడం ఇప్పుడు ట్రంప్ అధికార యంత్రాంగానికి మరింత విజయంగా మారింది. ట్రంప్ నిర్ణయంతో ఇక ఇరాన్, సిరియా, లిబియా, యెమెన్, సొమాలియా, ఛాద్‌లనుంచి సరైన నిర్థారణ పత్రాలు లేకుండా ప్రజలు అమెరికాలో అడుగుపెట్టడానికి వీలు లేదు. ఓ వైపు చట్టపరమైన సవాళ్ల విచారణలు సాగుతున్న దశలోనే ఈ ప్రయాణ నిషేధ ఉత్తర్వులు చెల్లుబాటులోకి వస్తాయని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ ఉత్తర్వులపై ఇతర కోర్టులు ఇంతకు ముందు వెలువరించిన స్టే ఆదేశాలను ఇప్పుడు సుప్రీంకోర్టుకు చెందిన తొమ్మండుగురు న్యాయమూర్తులలో ఏడుగురు వ్యతిరేకించారు. తామైతే ప్రభు త్వ నిర్ణయాన్ని వ్యతిరేకించి ఉండేవారమని ఇద్దరు న్యాయమూర్తులు రూత్ బెడెర్ గిన్సుబర్గ్, సోనియా సోటోమేయర్ తెలిపారు. న్యాయస్థానం తమ సమర్థనకు ఏ విధమైన కారణాలను చూపలేదు. అయితే దిగువ న్యాయస్థానాలు త్వరితగతిన తమ కార్యనిర్వాహక ఆదేశాలను సమీక్షించుకుంటే మంచిదని ఉన్నత న్యాయస్థానం సూచించింది.

Comments

comments