Search
Monday 11 December 2017
  • :
  • :

గోడకూలి వ్యక్తి మృతి

bodyమనతెలంగాణ/చిట్యాలః రోజుపనిచేసుకుంటే పూట గడవాని ఓకూలి గోడకూలి మత్యువాతపడ్డాడు.  మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో పోతుగంటి శంకరాచారి గల ఇంటివెనకాల నూతనంగా నిర్మించెందుకుగాను వచ్చిన కూలి చెలిమల సమ్మయ్య (55)అను వ్యక్తి మంగళవారం ఉదయం కూలిపనిలో భాగంగా పనిచేస్తుండగా ప్రమాదావశాత్తు గోడ కూళి అతనిపై పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో గమనించిన తోటికూలి కేకలు వేయడంతో చుట్టుప్రక్కవారు వచ్చి అతనిపై పడిన ఇటుకరాళ్ళను తొలగించి అనంతరం స్థానిక సివిల్ ఆసుపత్రి తరలించగా మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతునికి భార్య సరోజన ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

Comments

comments