Search
Sunday 27 May 2018
  • :
  • :

విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

MAN

మనతెలంగాణ/టేకుమట్ల : మండలంలోని వెల్లంపల్లి గ్రామానికి చెందిన బొజ్జపెల్లి బాబు(32) ప్రమాదశావత్తు విద్యుత్ షాక్ గురై చనిపోయినట్లు ఆదివారం తెలిసింది. వివరాల్లోకి వెళ్లితే బొజ్జపెల్లి బాబు తమ అక్క బావ ఊరైన రామకిష్టాపూర్(వి) గ్రామానికి వచ్చి వారి ఇంట్లో ఉన్న కరెంట్‌కు సెల్‌పోన్ చార్జీంగ్ పెడుతుండగా అకస్మత్తుగా విద్యుత్ సరఫరా అయి అక్కడికక్కడే చనిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు.  కాగా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల గ్రామంలోని ట్రాన్స్‌ఫర్మర్ హై ఓల్టేజ్ కరెంట్ సరఫరా కావడం వల్ల బొజ్జపెల్లి బాబు చనిపోయాడని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.  కాగా బొజ్జపెల్లి బాబు నిరుపేద కుటుంబానికి చెందిన వాడు అతని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రామకిష్టాపూర్(వి) సర్పంచ్ ఆకునూరి సుజాత తిరుపతి ప్రభుత్వాన్ని కోరారు.

Comments

comments